ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందుకే గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నాం: అచ్చెన్నాయుడు

ABN, First Publish Date - 2022-03-07T19:51:32+05:30

న్యాయవ్యవస్థపై ప్రభుత్వం దాడి చేసినా..రాష్ట్ర పెద్దగా ఏ ఒక్కరోజు గవర్నర్ మాట్లాడలేదని అచ్చెన్న విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: న్యాయవ్యవస్థపై ప్రభుత్వం దాడి చేసినా..రాష్ట్ర పెద్దగా ఏ ఒక్కరోజు గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడలేదని, అందుకే గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. అసెంబ్లీ సమావేశం తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ గవర్నర్‌కు తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందని, కనీసం దీనిపై గవర్నర్ స్పందించలేదని, తాము హెచ్చరించినా గవర్నర్ పట్టించుకోలేదని విమర్శించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రభుత్వం పని చేస్తున్నా.. దానిపై కూడా గవర్నర్ ఏనాడూ సీఎంను పిలిచి మాట్లాడలేదని అచ్చెన్న వ్యాఖ్యానించారు.


మూడు రాజధానుల బిల్లులో గవర్నర్ కూడా తప్పు చేశారని అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ బిల్లులు సరికాదని కోర్టులు కూడా చెప్పాయన్నారు. ఎన్నికల సంఘంపై దాడి జరిగినా గవర్నర్ స్పందించలేదని, ఈసీని ఎవరికీ తెలియకుండా తొలగించారన్నారు. సీఆర్డీఏ చట్టాన్ని రాత్రికి రాత్రే రద్దు చేశారని మండిపడ్డారు. అందరూ ఒప్పుకున్న చట్టాన్ని ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు. దీనిపై గవర్నర్ ప్రశ్నించకుండా సంతకం చేశారని అచ్చెన్నాయుడు విమర్శించారు.

Updated Date - 2022-03-07T19:51:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising