ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యానాం-ఎదుర్లంక వారధిపై ప్రమాదం... ముగ్గురి మృతి

ABN, First Publish Date - 2022-04-18T02:57:15+05:30

కోనసీమ జిల్లా యానాం-ఎదుర్లంక వారధిపై ఆదివారం మోటారుబైక్‌ను ఇసుకలోడుతో ఎదురుగా వస్తున్న టిప్పర్‌ ఢీకొట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐ.పోలవరం: కోనసీమ జిల్లా యానాం-ఎదుర్లంక వారధిపై ఆదివారం మోటారుబైక్‌ను ఇసుకలోడుతో ఎదురుగా వస్తున్న టిప్పర్‌ ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తలతో పాటు ఓ బాలుడు మృతి చెందారు. కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామానికి చెందిన గుబ్బల సుబ్రహ్మణ్యం(49), గుబ్బల మంగాదేవి(42)లు కుమార్తె కొడుకు జశ్వంత్‌ శివకార్తీక్‌(6), మనవరాలు తేజశ్రీలక్ష్మిలతో కలిసి  మోటార్‌సైకిల్‌పై  శనివారం మధ్యాహ్నం ద్రాక్షారామలో తన చిన్నకుమార్తె అనచూరి వెంకటేశ్వరి ఇంటికి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లారు. కార్యక్రమం అనంతరం ఇంటికి తిరిగి వస్తుండగా ఆదివారం సాయంత్రం యానాం-ఎదుర్లంక వారధిపై వీరిని టిప్పర్‌ ఢీకొట్టింది. దీంతో సుబ్రహ్మణ్యం, గుబ్బల మంగాదేవి, జశ్వంత్‌ శివకార్తీక్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. తేజశ్రీలక్ష్మి పరిస్థితి విషమంగా ఉండటంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఇసుకలారీను పోలీస్‌స్టేషన్‌కు తరలించి డ్రైవర్‌ సతీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-04-18T02:57:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising