AP News : ఏబీఎన్ కథనాలపై స్పందించిన కార్పొరేషన్ అధికారులు
ABN, First Publish Date - 2022-12-16T17:49:28+05:30
AP News : ఏబీఎన్ కథనాలపై స్పందించిన కార్పొరేషన్ అధికారులు
ఏలూరు: ఏలూరు కార్పొరేషన్ పరిధిలోని శ్మశాన వాటికల్లో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కాటి కాపారులు ఇష్టానుసారంగా వసూలు చేస్తుండడంతో ఏబీయన్ కథనాలను ప్రసారం చేసింది. దీంతో కార్పొరేషన్ అధికారులు స్పందించారు.
కమిషనర్ షాహిద్ కాటికాపరులతో సమావేశమయ్యారు. వారితో మాట్లాడుతూ.. ‘కాటికాపరులు శ్మశాన వాటికల్లో మృతదేహాల అంతిమ సంస్కారాలకు రూ. 5 వేలకు మించి వసూలు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో వారితో సమావేశం ఏర్పాటుచేశాం. రూ. 5వేలకు మించి వసూలు చేయకూడదని ఆదేశించాం. అంత్యక్రియలకు మృతుడి బంధువులు కట్టెలు, డీజిల్ తెచ్చుకుంటే కాపరికి రూ. 1500 మించి ఇవ్వరాదు’ అని కమిషనర్ పేర్కొన్నారు.
కాగా కట్టెలు, డీజిల్ కోసం కాటికాపరికి రూ. 3 వేలు ఇస్తే సరిపోతుందని, వాటిని కొని తెచ్చుకున్న వారి నుంచి రూ. 1000 వసూలు చేయాలని కొందరు కార్పొరేటర్లు సూచించడంతో వాటిని సమర్థిస్తున్నామని డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ముస్లిం శ్మశాన వాటికల్లో రూపాయి తీసుకోవడం లేదని, క్రైస్తవ శ్మశాన వాటికల్లో రూ. 1200 వసూలు చేస్తున్నారని కొందరు కార్పొరేటర్లు సమావేశం దృష్టికి తెచ్చారు.
Updated Date - 2022-12-16T17:51:48+05:30 IST