ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ABN కేసు: టీడీశాట్‌లో ఏపీ ఫైబర్ నెట్‌కు చుక్కెదురు

ABN, First Publish Date - 2022-04-30T00:53:57+05:30

ABN కేసు: టీడీశాట్‌లో ఏపీ ఫైబర్ నెట్‌కు చుక్కెదురు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: టీడీశాట్‌లో ఏపీ ఫైబర్ నెట్‌కు చుక్కెదురైంది. ఏపీ ఫైబర్ నెట్ ఎండీ మధుసూధన్‌రెడ్డికి బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు టీడీశాట్ చైర్మన్ జస్టిస్ డీఎన్ పటేల్ తెలిపారు. మధుసూధన్‌రెడ్డికి వారెంట్ అందజేయాలంటూ కృష్ణలంక పీఎస్‌ ఇంఛార్జ్‌కు టీడీశాట్ ఆదేశాలు ఇచ్చింది. ఏబీఎన్ కేసులో టీడీశాట్ విచారణకు ఏపీ ఫైబర్ నెట్ లాయర్లు హాజరుకాలేదని తెలిపింది. ఏబీఎన్ ఛానల్‌ను వెంటనే ప్రసారం చేయాలంటూ 2020 జనవరి 22న టీడీశాట్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఫైబర్ నెట్ టీడీశాట్ మధ్యంతర ఉత్తర్వులను అమలు చేయలేదని, ఏపీ ఫైబర్ నెట్ కౌంటర్ కూడా దాఖలు చేయలేదని పేర్కొంది.


ఆగస్టు 16న టీడీశాట్ ఎదుట హాజరుకావాలంటూ ఫైబర్ నెట్ ఎండీ మధుసూధన్‌రెడ్డికి టీడీశాట్‌ ఆదేశాలు ఇచ్చింది. కావాలంటే కోర్టు ధిక్కార పిటిషన్‌ను ఫైబర్ నెట్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసుకోవచ్చని టీడీశాట్‌ ఛైర్మన్ డీఎన్ పటేల్ ఏబీఎన్‌కు సూచించారు. జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏబీఎన్ ప్రసారాలను ఫైబర్ నెట్ నిలిపేసింది. ఫైబర్ నెట్ చర్యలను టీడీశాట్‌లో ఏబీఎన్ సవాల్‌ చేసింది. ఏబీఎన్ ఛానల్‌ను వెంటనే ప్రసారం చేయాలని గతంలో టీడీశాట్ ఆదేశాలు ఇచ్చింది. రెండేళ్లు దాటినా ఏబీఎన్ ఛానల్‌ను ఫైబర్ నెట్ ప్రసారం చేయలేదు. ఏబీఎన్ తరపున సుప్రీంకోర్టు లాయర్ గుంటూరు ప్రేరణ వాదనలు వినిపించారు. 

Updated Date - 2022-04-30T00:53:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising