ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దూసుకొచ్చిన మృత్యువు

ABN, First Publish Date - 2022-10-07T08:44:43+05:30

దూసుకొచ్చిన మృత్యువు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆగి ఉన్న కారును ఢీకొన్న తెలంగాణ ఆర్టీసీ బస్సు

దంపతులు మృతి.. కుమారుడికి తీవ్రగాయాలు


కొడవలూరు, అక్టోబరు 6: శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం కమ్మపాళెం సమీపంలో జాతీయరహదారిపై ఆగి ఉన్న కారును తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో భార్యాభర్తలు మృతి చెందారు. వారి కుమారుడు తీ వ్రంగా గాయపడ్డాడు. వివరాలు.. బాపట్ల జిల్లా అరవపాళెం గ్రామానికి చెందిన మాలపాటి సుబ్బరామయ్య కుటుంబం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం బుధవారం అర్ధరాత్రి కారులో తిరుమలకు బయలుదేరింది. సుబ్బరామయ్య కుమారుడు శోభన్‌బాబు కారు నడుపుతుండగా గురువారం వేకువజామున 3.30 గంటల ప్రాంతంలో కారు మరమ్మతుకు గురవడంతో కమ్మపాళెం సమీపంలో జాతీయరహదారి పక్కన ఆపారు. తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సు కారు పక్కన నిలుచున్న సుబ్బరామయ్యను, కారును ఢీకొంది. దీంతో సుబ్బరామయ్య (81), ఆయన భార్య సుబ్బరామమ్మ (61) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. శోభన్‌బాబుకు (45) తీవ్ర గాయాలు కావడంతో నెల్లూరు నగరంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుబ్బారావు తెలిపారు.


Updated Date - 2022-10-07T08:44:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising