ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దివాళా అంచున రాష్ట్రం

ABN, First Publish Date - 2022-12-12T02:14:21+05:30

ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, దివాళా అంచున ఉందని కాంగ్రెస్‌ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్‌ డాక్టర్‌ నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది

శ్రీలంక దుస్థితిని మించిపోయింది: తులసిరెడ్డి

వేంపల్లె, డిసెంబరు 11: ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, దివాళా అంచున ఉందని కాంగ్రెస్‌ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్‌ డాక్టర్‌ నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలివ్వడం లేదని ఆదివారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతినెలా ఇదే పరిస్థితి ఉందని, ఈనెల 11వ తేదీ వచ్చినా ఇంకా కొందరికి జీతాలు పడలేదని తెలిపారు. విశ్రాంత ఉద్యోగులకు సకాలంలో పింఛన్‌ ఇవ్వడం లేదన్నారు. పదవీ విరమణ చేసిన ప్రభుత్వోద్యోగులకు సకాలంలో రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. పెండింగ్‌ బకాయిలు ఇవ్వండి - మా ప్రాణాలు కాపాడండి అని కాం ట్రాక్టర్లు భిక్షాటన చేస్తున్నారని, టెండర్లలో కాంట్రాక్టర్లు పా ల్గొనడం లేదని వివరించారు. సర్పంచులు భిక్షాటన చేస్తున్నారని, రోడ్లు, సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులకు డబ్బు లు లేవని తెలిపారు. రైతులకు ధాన్యం డబ్బు సకాలంలో ఇవ్వడం లేదని, హాస్టళ్లలో ఆకలి కేకలు వినిపిస్తున్నా యని, మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వక రైల్వే ప్రాజెక్టుల పనులు నిలిచిపోయాయని వివరించారు. ప్రతిరోజు రిజ ర్వు బ్యాంకు వద్ద దేహీ అని ప్రభుత్వం చేతులు చాస్తోందని, మరోవైపు ప్రభుత్వ ఆస్తులు తెగనమ్ముతోందని తెలిపారు. రాష్ట్రం అప్పులకుప్పయిందన్నారు. శ్రీలంక అప్పు రూ.2.80లక్షల కోట్లు కాగా, ఏపీ అప్పు రూ.8లక్షల కోట్లు అని, శ్రీలంక అధ్యక్షుడు దేశం వదిలి పారిపోయినట్టు ముఖ్యమంత్రి కూడా పారిపోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.

Updated Date - 2022-12-12T02:14:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising