ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేజీహెచ్‌లో అరుదైన శస్త్రచికిత్స

ABN, First Publish Date - 2022-10-07T08:51:58+05:30

కేజీహెచ్‌లో అరుదైన శస్త్రచికిత్స

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రెయిన్‌లో క్లిష్టమైన ప్రాంతంలో ట్యూమర్‌ తొలగింపు

సుమారు 13 గంటలపాటు నిర్విరామంగా ఆపరేషన్‌


మహారాణిపేట (విశాఖపట్నం), అక్టోబరు 6: బ్రెయిన్‌లో కణతి వచ్చిన ఒక రోగికి గతంలో ప్రైవేటు ఆస్పత్రిలో శస్త్రచికిత్స నిర్వహించారు. కానీ.. దాన్ని పూర్తిగా తొలగించకుండా వదిలేయడంతో సమస్య తిరగబెట్టింది. దీంతో నాలుగైదు నెలలుగా ఆ రోగి మంచానికే పరిమితమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో విశాఖపట్నంలోని కేజీహెచ్‌ వైద్యులు అత్యంత అరుదైన, క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడారు. ఏకంగా 13 గంటలపాటు నిర్విరామంగా ఆపరేషన్‌ నిర్వహించి ఆ ట్యూమర్‌ను తొలగించారు. గురువారం న్యూరో సర్జరీ విభాగంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేజీహెచ్‌ వైద్యులు ఆ వివరాలను వెల్లడించారు. గుంటూరు జిల్లా మాచర్లకు గినిపల్లి ఇర్మియా (50)కు బ్రెయిన్‌లో (రక్తనాళాలకు, కంటి నరాలకు మధ్య) ట్యూమర్‌ ఏర్పడింది. గతేడాది గుంటూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేసినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో నాలుగైదు నెలలుగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. కొన్ని శరీర అవయవాలు, కాళ్లు కూడా కదపలేక పూర్తిగా మంచానికే పరిమతమయ్యారు. ఈ క్రమంలో ఆయన కుటుంబసభ్యులు.. కేజీహెచ్‌ వైద్యుడు డాక్టర్‌ వైఎల్‌ నరసింగరావును సంప్రదించారు. ఆయన సూచనతో ఇర్మియాను గత నెల 5న కేజీహెచ్‌లో చేర్చారు. న్యూరో సర్జరీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ డాక్టర్‌ ప్రేమ్‌జిత్రే ఆధ్వర్యంలో అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు అసంపూర్తిగా ఉన్న ట్యూమర్‌ను గుర్తించారు. గత నెల 17న ఉదయం 9గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు నిర్విరామంగా శస్త్రచికిత్స నిర్వహించి ట్యూమర్‌ను పూర్తిగా తొలగించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో గురువారం డిశ్చార్జ్‌ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుందరరాజు మాట్లాడుతూ.. ఆస్పత్రిలో సుమారు రెండున్నర కోట్ల విలువ చేసే ఆపరేటింగ్‌ మైక్రోస్కోప్‌ వంటి అధునాతన వైద్య పరికరం అందుబాటులోకి రావడంతో అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించగలిగామని తెలిపారు. మరో రెండు నెలల్లో రోగి యథాస్థితికి చేరుకోగలరన్నారు. శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన డాక్టర్‌ ప్రేమ్‌జిత్రే బృందాన్ని అభినందించారు.


Updated Date - 2022-10-07T08:51:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising