ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సప్లిమెంటరీలోనూ 64.23 శాతమే

ABN, First Publish Date - 2022-08-04T08:17:30+05:30

సప్లిమెంటరీలోనూ 64.23 శాతమే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫలితాల్లో ప్రకాశం టాప్‌.. పశ్చిమ లాస్ట్‌

పది సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఈ ఏడాది మొత్తం ఉత్తీర్ణత 88.68ు

పరీక్షలను పరీక్షల్లానే కఠినంగా నిర్వహించాం: మంత్రి బొత్స  


అమరావతి, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాల్లోనూ మెరుగుదల కనిపించలేదు. ఈ ఏడాది రెగ్యులర్‌ ఫలితాల్లో అత్యల్ప స్థాయిలో 67.26 శాతమే ఉత్తీర్ణత నమోదుకాగా.. జూలైలో నిర్వహించిన సప్లిమెంటరీ పరీక్షల్లోనూ 64.23 శాతం మందే ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం విజయవాడలో ప్రకటించారు. మొత్తం 2,06,648 మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకోగా, 1,91,846 మంది పరీక్షలు రాశారని, వారిలో 1,23,231 (64.23శాతం) ఉత్తీర్ణులయ్యారని మంత్రి వెల్లడించారు. బాలురలో 1,09,413 మందికి గాను 66,554 (60.83శాతం) మంది, బాలికల్లో 82,433 మందికిగాను 56,677 (68.76శాతం) మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. మొదటి డివిజన్‌లో 22,236 మంది, రెండో డివిజన్‌లో 46,725 మంది, మూడో డివిజన్‌లో 54,249 మంది ఉన్నారని వివరించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 87.52 శాతం మంది ఉత్తీర్ణులుకాగా, పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 46.66 శాతం మంది పాసయ్యారని పేర్కొన్నారు. ఈ ఫలితాలతో మొత్తంగా 2022లో 88.68శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లయిందని తెలిపారు. మొత్తం 6,06,070 మంది విద్యార్థులకుగాను రెగ్యులర్‌, సప్లిమెంటరీ రెండు విడతల్లో కలిపి 5,37,491 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. కొవిడ్‌ కారణంగా ఏర్పడిన పరిస్థితులతో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిలయ్యారనే ఉద్దేశంతో ఈ ఏడాది సప్లిమెంటరీలో పాసైన వారికి కూడా రెగ్యులర్‌ తరహాలో సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు చెప్పారు. ఇది ఈ ఒక్క ఏడాదికి మాత్రమేనని స్పష్టంచేశారు. ఉత్తీర్ణత పెంచుకోవడం కోసం తమ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవడాన్ని ప్రోహించదని వ్యాఖ్యానించారు. మాల్‌ ప్రాక్టీ్‌సపైనా కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పారు. కాగా బెటర్‌మెంట్‌ పరీక్షలకు సబ్జెక్టులవారీగా 12,076 మంది దరఖాస్తు చేసుకోగా 11,528 మంది  హాజరయ్యారు. వారిలో 10,201 మందికి బెటర్‌మెంట్‌ లభించింది.


జిల్లాల వారీగా ఉత్తీర్ణత..

ఉమ్మడి జిల్లాల ప్రామాణికంగా... ప్రకాశం 87.52శాతం, శ్రీకాకుళం 86.96, కడప 78.42, చిత్తూరు 76.82, గుంటూరు 74.67, విశాఖపట్నం 69.59, విజయనగరం 65.77, తూర్పుగోదావరి 60.64, నెల్లూరు 60.4, కర్నూలు 57.89ం, కృష్ణా 56.91, అనంతపురం 54.01, పశ్చిమగోదావరి 46.66శాతం ఉత్తీర్ణత సాధించాయి.

Updated Date - 2022-08-04T08:17:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising