మనీలాండరింగ్ కేసులో 37.38 కోట్ల ఆస్తుల అటాచ్
ABN, First Publish Date - 2022-08-04T09:08:31+05:30
మనీలాండరింగ్ కేసులో 37.38 కోట్ల ఆస్తుల అటాచ్
విశాఖపట్నం, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): మనీ లాండరింగ్ కేసులో నగరంలోని శ్రీకృష్ణ స్టాకిస్ట్స్ అండ్ ట్రేడర్స్‌కు చెందిన రూ.37.39 కోట్ల విలువైన స్థిరాస్తులను అటాచ్‌మెంట్ చేస్తూ విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ సంస్థకు చెందిన డైరెక్టర్లు బ్యాంకును మోసం చేశారన్న అభియోగంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 2002లో కేసు నమోదు చేసింది. ఇటీవల ఈ కేసు విచారణకు రాగా నిందితుడు ధరవత్ సక్రును విచారించింది. ఈ సందర్భంగా సంస్థకు చెందిన భూములు, భవనాలను స్వాఽధీనం చేసుకోవడానికి అనుమతిచ్చింది.
Updated Date - 2022-08-04T09:08:31+05:30 IST