ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళలకు 33% రిజర్వేషన్‌ కల్పించాలి

ABN, First Publish Date - 2022-08-16T08:49:39+05:30

పంద్రాగస్టు వేడుకలను జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ రాష్ట్ర కార్యాలయంలో జాతీ య పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పార్టీ పలు తీర్మానాలు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • స్వాతంత్య్ర వేడుకల్లో జనసేన పార్టీ తీర్మానాలు
  • జెండాను ఆవిష్కరించిన పవన్‌ కల్యాణ్‌


అమరావతి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): పంద్రాగస్టు వేడుకలను జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ రాష్ట్ర కార్యాలయంలో జాతీ య పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పార్టీ పలు తీర్మానాలు చేసింది. రాజకీయ వ్యవహరాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తీర్మానాలను ప్రవేశపెట్టారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని తీర్మానం చేశారు. ‘‘గాంధీజీ, అంబేడ్కర్‌, సుభాష్‌ చంద్రబోస్‌, పోట్టి శ్రీరాములు, టంగుటూరి ప్రకాశం, అల్లూరి సీతారామరాజు... వంటి జాతీయ, రాష్ట్ర, స్థానిక నేతలకు కులం అంటగట్టడం భావ్యం కాదు. వారిని దేశ నాయకులుగా అనుసరిద్దాం. జాతికి నాయకులుగా గౌరవిద్దాం’’ అని తీర్మానం చేశారు. కాగా, గుంటూరు జిల్లా కొల్లిపర మండలానికి చెందిన వైసీపీ నాయకులు ఉయ్యురు శివరామిరెడ్డి జనసేన పార్టీలో చేరారు. 

Updated Date - 2022-08-16T08:49:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising