ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tirumala padayatra: 300 సార్లు కాలినడకన తిరుమలకు

ABN, First Publish Date - 2022-11-09T03:43:48+05:30

300 సార్లు కాలినడకన తిరుమల కొండెక్కి శ్రీవారిపై తన భక్తిని చాటుకున్నాడో హైదరాబాద్‌ వాసి. శ్రీఅష్టోత్తర శత చుక్కల చారిటబుల్‌ ట్రస్ట్‌ ఫౌండర్‌ వేణుకుమార్‌ చుక్కల 1996 నుంచి కాలినడకన తిరుమలకు వస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోపాన పాదయాత్రతో భక్తి చాటుకున్న హైదరాబాద్‌ వాసి

తిరుమల, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): 300 సార్లు కాలినడకన తిరుమల కొండెక్కి శ్రీవారిపై తన భక్తిని చాటుకున్నాడో హైదరాబాద్‌ వాసి. శ్రీఅష్టోత్తర శత చుక్కల చారిటబుల్‌ ట్రస్ట్‌ ఫౌండర్‌ వేణుకుమార్‌ చుక్కల 1996 నుంచి కాలినడకన తిరుమలకు వస్తున్నారు. తిరుమల వేంకటేశ్వరస్వామి వైభవాన్ని చాటిచెప్పేందుకు సోపాన పాదయాత్ర నిర్వహిస్తున్నారు. జీవితంలో ఒక్కసారి కూడా తిరుమలకు కొండకు రాని పేదవర్గాల వారిని, అంధులను, దివ్యాంగులను, వృద్ధులను బృందంగా ఏర్పాటు చేసి తిరుమలకు తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం ఆయన 11మంది భక్తులతో శ్రీవారిమెట్టు మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నారు. 1008 సార్లు తిరుమలకు పాదయాత్రగా రావడంతో పాటు వేంకటేశ్వరస్వామి, తిరుమల వైభవాన్ని వీలైనంతమందికి తెలియజేయడమే తన లక్ష్యమని వేణు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

Updated Date - 2022-11-09T03:43:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising