ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Common Holidays: 2023లో సాధారణ సెలవులు 23

ABN, First Publish Date - 2022-12-16T00:39:28+05:30

రాష్ట్ర ప్రభుత్వం 2023 సంవత్సరానికి గాను సెలవుల కేలెండర్‌ను విడుదల చేసింది. వచ్చే ఏడాది ప్రభుత్వ కార్యాలయాలకు 23 సాధారణ సెలవులు, 22 ఐచ్ఛిక సెలవులు ఉంటాయని ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐచ్ఛిక సెలవులు 22

ఆదివారం వచ్చిన సంక్రాంతి, దుర్గాష్టమి, దీపావళి

సెలవుల కేలెండర్‌ విడుదల చేసిన ప్రభుత్వం

ఉగాది, శ్రీరామనవమి, వినాయక చవితి

పండుగలకు బ్యాంకులకు సెలవుల్లేవ్‌

అమరావతి, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం 2023 సంవత్సరానికి గాను సెలవుల కేలెండర్‌ను విడుదల చేసింది. వచ్చే ఏడాది ప్రభుత్వ కార్యాలయాలకు 23 సాధారణ సెలవులు, 22 ఐచ్ఛిక సెలవులు ఉంటాయని ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రంజాన్‌, బక్రీద్‌, మొహర్రం, ఈద్‌ మిలాద్‌-ఉన్‌-నబీ వంటి పండుగలతో పాటు తిథులను బట్టి హిందూ పండుగల్లో మార్పులు వస్తే ముందస్తుగా పత్రికా ప్రకటనల ద్వారా, మీడియా ద్వారా తెలియజేస్తామని ప్రభుత్వం స్పష్టంచేసింది. ప్రభుత్వ ఉద్యోగులు ఏడాదిలో 5 ఐచ్ఛిక సెలవులను ఉన్నతాధికారుల అనుమతితో పొందవచ్చని తెలిపింది. 2023లో మూడు సాధారణ సెలవులు ఆదివారం రాగా, ఒకటి రెండో శనివారం వచ్చింది. అదేవిధంగా నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్ట్‌ ప్రకారం వర్తించే సెలవుల జాబితాను మరో ఉత్తర్వులో విడుదల చేసింది.

2023లో సాధారణ సెలవులు ఇవే...

భోగి జనవరి 14 (శనివారం)

సంక్రాంతి జనవరి 15 (ఆదివారం)

కనుమ జనవరి 16 (సోమవారం)

రిపబ్లిక్‌ డే జనవరి 26 (గురువారం)

మహాశివరాత్రి ఫిబ్రవరి 18 (శనివారం)

హోలీ మార్చి 8 (బుధవారం)

ఉగాది మార్చి 22 (బుధవారం)

శ్రీరామనవమి మార్చి 30 (గురువారం)

బాబు జగ్జీవన్‌రామ్‌ ఏప్రిల్‌ 5 (బుధవారం)

జయంతి

గుడ్‌ ఫ్రైడే ఏప్రిల్‌ 7 (శుక్రవారం)

అంబేద్కర్‌ జయంతి ఏప్రిల్‌ 14 (శుక్రవారం)

రంజాన్‌ ఏప్రిల్‌ 22 (శనివారం)

బక్రీద్‌ జూన్‌ 29 (గురువారం)

మొహర్రం జూలై 29 (శనివారం)

సాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15 (మంగళవారం)

శ్రీకృష్ణాష్టమి సెప్టెంబరు 6 (బుధవారం)

వినాయకచవితి సెప్టెంబరు 18 (సోమవారం)

ఈద్‌ మిలాద్‌-ఉన్‌-నబీ సెప్టెంబరు 28 (గురువారం)

మహాత్మాగాంధీ అక్టోబరు 2 (సోమవారం)

జయంతి

దుర్గాష్టమి అక్టోబరు 22 (ఆదివారం)

విజయదశమి అక్టోబరు 23 (సోమవారం)

దీపావళి నవంబరు 12 (ఆదివారం)

క్రిస్మస్‌ డిసెంబరు 25 (సోమవారం)

ఆ మూడు పండుగలకు సెలవులివ్వండి

సీఎ్‌సకు బ్యాంకర్ల యూనియన్‌ లేఖ

విజయవాడ, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): ఉగాది, శ్రీరామనవమి, వినాయక చవితికి రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకర్లకు సెలవులు లేకపోవడంపై నిరసనను తెలుపుతూ యూనైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ కన్వీనర్‌ బీఎస్‌ రాంబాబు రాష్ట్ర సీఎస్‌ జవహర్‌రెడ్డికి లేఖ రాశారు. మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తోందని, ముఖ్యమైన హిందువుల పండుగలకు సెలవులు ఇవ్వట్లేదని తెలిపారు. ఆ తర్వాత బ్యాంకర్లు వినతుల మీద వినతులు చేసుకుంటే అప్పుడు సెలవు ప్రకటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు ఉద్యోగులందరూ చేతులు కట్టుకుని పండుగ సెలవుల కోసం వేడుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే తన తప్పును దిద్దుకుని ఆ మూడు పండుగలకు సెలవు ప్రకటించాలని రాంబాబు కోరారు.

Updated Date - 2022-12-16T00:39:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising