ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చట్టం మారిస్తే జరిగేది ఇదీ

ABN, First Publish Date - 2022-10-17T09:14:59+05:30

రాష్ట్రంలోని మొత్తం అసైన్డ్‌ భూముల్లో 20ఏళ్ల కాలపరిమితి దాటినవి 90 శాతం వరకూ ఉన్నాయి. అంటే వీటికి అసైన్‌ మెంట్‌ అయి 20ఏళ్ల గడువు తీరిపోయింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్రంలోని మొత్తం అసైన్డ్‌ భూముల్లో 20ఏళ్ల కాలపరిమితి దాటినవి 90 శాతం వరకూ ఉన్నాయి. అంటే వీటికి అసైన్‌ మెంట్‌ అయి 20ఏళ్ల గడువు తీరిపోయింది.. పీఓటీ చట్టంలో సవరణ తీసుకొచ్చి 15 లేదా 20ఏళ్ల అసైన్‌మెంట్‌ గడువు తీరిన వాటికి పూర్తి హక్కులు ఇస్తే దాదాపు 30 లక్షల ఎకరాలకు విముక్తి లభిస్తుంది. అందులో ఇప్పటికే సింహభాగం పెత్తందారులు, నేతలు, భూ ఆక్రమణ దారుల చెరలో, అనధికార ఒప్పందాల రూపంలో ప్రైవేటు సాగులో ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఆక్రమణలు, ప్రైవేటు చేతికి వెళ్లిన భూములను రెవెన్యూశాఖ స్వాధీనం చేసుకొని రైతులకు అప్పగించాలి. ఆ పని ముందుకు సాగడం లేదు. అంటే పీఓటీ చట్టం ఉన్నా సరైన రక్షణ లేదు.


ఇక చట్టబద్ధమైన రక్షణ తీసేస్తే భూములన్నీ పూర్తిగా బలవంతుల చేతుల్లోకి వెళ్లిపోతాయి. దీనివల్ల పేదలకు కలగే లబ్ధి ఏముంది? నేతలకే లాభం తప్ప మరొకటి కనిపించడం లేదని రెవెన్యూ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ చట్ట సవరణ కేంద్రం విచక్షణపై ఆధారపడి ఉంటుంది. ఒక్క రాష్ట్రంలో పీఓటీ చట్టాన్ని మారిస్తే మిగిలిన రాష్ట్రాలు అదే పనిచేస్తాయి. అప్పుడు భూ పంపిణీ లక్ష్యాలు ప్రమాదంలో పడిపోతాయి. కాబట్టి కేంద్రం ఇలాంటి చర్యలకు అనుమతించదని నిపుణులు పేర్కొంటున్నారు. 

Updated Date - 2022-10-17T09:14:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising