ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాయలసీమలో జిల్లాల పునర్విభజనపై 1600 అభ్యంతరాలు

ABN, First Publish Date - 2022-02-26T20:59:20+05:30

రాయలసీమలో జిల్లాల పునర్విభజనపై 1600 వరకు అభ్యంతరాలు వచ్చాయని ఏపీ ప్లానింగ్ సెక్రటరీ విజయ్ కుమార్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: రాయలసీమలో జిల్లాల పునర్విభజనపై 1600 వరకు అభ్యంతరాలు వచ్చాయని ఏపీ ప్లానింగ్ సెక్రటరీ విజయ్ కుమార్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి అంశాన్ని పూర్వపరాలు పరిశీలించి వాస్తవ పరిస్థితి ఏంటనేది చూస్తున్నామన్నారు.పుట్టపర్తి జిల్లా కేంద్రం ఏర్పాటుపై ఒక భావన వ్యక్తం అయిందన్నారు. పెనుకొండ , హిందూపురం జిల్లా కేంద్రంగా ఏర్పాటు కోసం డిమాండ్ ఉందన్నారు. ఏ విధంగా జిల్లా కేంద్రం ఏర్పాటు ఉండాలనేది పరిశీలనలో ఉందని చెప్పారు. కలెక్టర్లు వారికి వచ్చిన అభ్యంతరాలు సలహాల మీద వాస్తవ పరిస్థితి  ఏవిధంగా ఉందనే దానిపై ప్రభుత్వం నుంచి తుది నోటిఫికేషన్ వస్తుందన్నారు. జిల్లాలు ఏ రోజు నుంచి ఆవిర్భావం అవుతాయనే దానిపై  తుది నోటిఫికేషన్‌లో తెలియచేస్తామన్నారు. తిరుపతి కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాలోకి నెల్లూరు జిల్లా నుంచి కొన్ని మండలాలు కలుస్తాయన్నారు.  ఆ మండలాల వరకు మాత్రమే జోనల్ ఇష్యూ ఉందన్నారు. ఉగాది నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనేది ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సంకల్పమని  విజయ్ కుమార్ తెలిపారు. 

Updated Date - 2022-02-26T20:59:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising