ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

108 కాదు 10 వేల కాయలు కొట్టినా భగవంతుడు మావైపే: జేఏసీ

ABN, First Publish Date - 2022-10-07T08:16:39+05:30

108 కాదు 10 వేల కాయలు కొట్టినా భగవంతుడు మావైపే: జేఏసీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం, అక్టోబరు 6: ‘మహా పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మంత్రులు, వైసీపీ నేతలు అమరావతికి వ్యతిరేకంగా 108 కొబ్బరికాయలు కాదు 10వేల కాయలు కొట్టినా భగవంతుడు మీవైపు చూడడు’ అని అమరావతి జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. జేఏసీ నేత శివారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు అమరావతి రాజధానిగా ఉండటానికి జగన్‌ అంగీకారం తెలిపారో, లేదో మంత్రి రోజా చెప్పాలన్నారు. రాష్ట్ర భవిష్యత్తును మార్చబోయే మహాయజ్ఞం తమ పాదయాత్రేనని జేఏసీ నేత తిరుపతిరావు అన్నారు. ‘‘బొత్స సత్యనారాయణా.. త్వరలో విజయనగరం వస్తాం.. మీ ఇంటి ముందే పాదయాత్ర కొనసాగిస్తాం.. ఏం చేస్తావో చేసుకో..’’ అంటూ అమరావతి జేఏసీ నాయకుడు కొలికపూడి శ్రీనివాస్‌ సవాల్‌ చేశారు. అమరావతిలో అవినీతి జరిగిందని నిరూపించామని బొత్స చెప్పారని, అయితే ఇంతవరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. ఈ మూడున్నరేళ్లలో ఎంతమందిని శిక్షించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-10-07T08:16:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising