ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్‌ కచోరి

ABN, First Publish Date - 2021-03-12T17:54:42+05:30

గోధుమ రవ్వ: కప్పు, గోధుమ పిండి: మూడు స్పూన్లు, శెనగ పిండి: రెండు స్పూన్లు కారం, మిరియాల పొడి, ఉప్పు: స్పూను చొప్పున, నూనె: తగినంత, కచోరిలో నింపేందుకు ఉడికించిన శనగలు, పెసర్లు: ఒకటిన్నర కప్పు, ఆలుగడ్డలు(ఉడికించి, పొట్టుతీసిన చిన్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: గోధుమ రవ్వ: కప్పు, గోధుమ పిండి: మూడు స్పూన్లు, శెనగ పిండి: రెండు స్పూన్లు కారం, మిరియాల పొడి, ఉప్పు: స్పూను చొప్పున, నూనె: తగినంత, కచోరిలో నింపేందుకు ఉడికించిన శనగలు, పెసర్లు: ఒకటిన్నర కప్పు, ఆలుగడ్డలు(ఉడికించి, పొట్టుతీసిన చిన్న ముక్కలు): ఒకటిన్నర కప్పు, పాప్డి: పది బూందీ సేమియా, చాట్‌ మసాలా పొడి, కారం, కొత్తిమీర: అవసరమైనంత దానిమ్మ గింజలు, పెరుగు: సగం కప్పు


తయారుచేసే విధానం: రవ్వకు గోధుమ పిండి, శెనగ పిండి వేసి బాగా కలపాలి. దీనికే ఉప్పు, కారం, మిరియాల పొడి, ఓ స్పూను నూనె వేసి నీళ్లతో పూరీ పిండిలా కలపాలి. అరగంట ఆరనిచ్చాక పూరీల్లా వత్తుకుని, నూనెలో కాల్చాలి. అయితే కచోరీలను మరీ పలుచగా, మందంగా కాకుండా ఓ మోస్తరుగా వత్తుకోవాలి. అన్నీ కాలాక ఒక్కో కచోరీని ఓ ప్లేట్‌లోకి తీసుకుని మధ్యలో రంధ్రం చేయాలి. అందులో మొదట ఉడికించిన శెనగలు, పెసర్లు, ఆలూ ముక్కలు వేయాలి. కారం, మిరియాల పొడి, ఛాట్‌ పౌడర్‌ వేసి పైన ఓ స్పూను పెరుగు వేయాలి. దీనిపైన అప్పడం ముక్కలు, బూందీ సేమియా, కొత్తిమీర, దానిమ్మ గింజలు వేస్తే రాజ్‌ కచోరీ సిద్ధం. కొంత మంది కెచప్‌ లేదా తియ్యటి చింతపండు పచ్చడి కూడా వేసుకుంటారు. 

Updated Date - 2021-03-12T17:54:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising