ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పులిహోర ప్రసాదం

ABN, First Publish Date - 2021-06-12T21:37:10+05:30

తిరుమల వేంకటేశ్వర స్వామికి తయారుచేసే ప్రసాదాలు దిట్టంని ఆధారంగా చేసుకుని తయారుచేస్తారు. ఈ పులిహోర కూడా దిట్టంను అనుసరించి తయారు చేసేదే. ఇందులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల వేంకటేశ్వర స్వామికి తయారుచేసే ప్రసాదాలు దిట్టంని ఆధారంగా చేసుకుని తయారుచేస్తారు. ఈ పులిహోర కూడా దిట్టంను అనుసరించి తయారు చేసేదే. ఇందులో పోషకాలు పుష్కలం. ఇందులో వేసే పసుపు, ఇంగువ, ధనియాల పొడి వల్ల వర్షాకాలంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. 


కావలసినవి: బియ్యం, చింతపండు, పసుపు, ఇంగువ, ఆవపిండి, ఉప్పు, ధనియాల పొడి, మిరియాల పొడి, బెల్లం, నూనె, మెంతులు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, నెయ్యి.


తయారీ విధానం: ముందుగా వార్చుకోవడానికి వీలుగా ఉన్న గిన్నెలో ఐదు లీటర్ల నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. తరువాత శుభ్రంగా కడిగిన బియ్యం వేయాలి. ఈ లోపు చింతపండును గిన్నెలో తీసుకుని, కొద్దిగా వేడి నీళ్లు పోసి, చిక్కటి పులుసు తీసి పెట్టుకోవాలి. పులిహోర కలుపుకొనే గిన్నెలో కరివేపాకు వేసుకోవాలి. బియ్యం పలుకు చూసి బాగా మెత్తగా అవ్వకుండా, కొంచెం బిరుసుగా ఉన్నప్పుడే అన్నం వార్చుకోవాలి. అన్నం రెడీ అయ్యాక కరివేపాకు వేసుకున్న గిన్నెలోకి మార్చుకోవాలి. ఒక చిన్న గిన్నెలో సరిపడా నూనె వేసుకుని అందులో పసుపు, ఇంగువ, ఆవపిండి వేసుకుని గడ్డలు లేకుండా బాగా కలిపి అన్నంకు పట్టించాలి. తరువాత కొంచెం నిమ్మరసం ఉప్పు కలిపి, ఉప్పు కరిగిన తరువాత అన్నంకు పట్టించాలి. తాలింపు కోసం స్టవ్‌పై పాత్రను పెట్టి నూనె వేయాలి.


కాస్త వేడి అయ్యాక మెంతులు, శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తరువాత మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేయాలి. ఈ తాలింపును అన్నంలో కలుపుకోవాలి. నూనె పోయకుండా పాత్రలోనే ఉండనివ్వాలి. ఆ నూనెలో ధనియాల పొడి, మిరియాల పొడి వేయాలి. వెంటనే చింతపండు పులుసును పోయాలి. తరువాత కొద్దిగా పసుపు, ఇంగువ, ఉప్పు, కొద్దిగా బెల్లం వేసుకోవాలి. పులుసు మీద నూనె తేలి కొద్దిగా చిక్కబడిన తరువాత అన్నంలో కలుపుకోవాలి. చివర్లో కొద్దిగా నెయ్యి కలపాలి.

Updated Date - 2021-06-12T21:37:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising