ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాలకూర - కొత్తిమీర దోశ

ABN, First Publish Date - 2021-01-23T18:54:51+05:30

కారం దోశ.. ఆనియన్‌ దోశ... రవ్వ దోశ... ఎప్పుడూ ఈ రుచులేనా! పనసపండు దోశ, ఓట్స్‌ - కొబ్బరి దోశ, పాలకూర - కొత్తిమీర దోశ, బక్వీట్‌ దోశ, సోయా దోశ.. ఇలా వెరైటీ దోశలనూ ఓసారి ట్రై చేయండి. ఇవి రుచితో మీ దిల్‌ దోచుకుంటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కారం దోశ.. ఆనియన్‌ దోశ... రవ్వ దోశ... ఎప్పుడూ ఈ రుచులేనా! 

పనసపండు దోశ, ఓట్స్‌ - కొబ్బరి దోశ, పాలకూర - కొత్తిమీర దోశ, బక్వీట్‌ దోశ, సోయా దోశ.. ఇలా వెరైటీ దోశలనూ ఓసారి ట్రై చేయండి. ఇవి రుచితో మీ దిల్‌ దోచుకుంటాయి.


కావలసినవి: పాలకూర - ఒక కప్పు(సన్నగా తరిగినది), కొత్తిమీర - పావుకప్పు(తరిగినది), ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, గోధుమపిండి - ఒక కప్పు, ఓట్స్‌ - అరకప్పు, రవ్వ - అరకప్పు, మిరియాల పొడి - ఒక టేబుల్‌స్పూన్‌, నూనె - కొద్దిగా, ఉప్పు - తగినంత.


తయారీ విధానం: ముందుగా పాలకూర, కొత్తిమీరను మిక్సీలో వేసి మెత్తటి పేస్టులా చేసుకోవాలి. ఒక పాత్రలో గోధుమపిండి తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా కలుపుకోవాలి. తరువాత అందులో పాలకూర, కొత్తిమీర పేస్టు వేయాలి. ఉల్లిపాయలు, ఓట్స్‌, పచ్చిమిర్చి, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. మిశ్రమం చిక్కగా ఉంటే కొద్దిగా నీళ్లు  కలుపుకోవచ్చు. ఇప్పుడు స్టవ్‌పై పెనం పెట్టి దోశలు పోసుకోవాలి. కొద్దిగా నూనె వేసుకుంటూ కాల్చుకోవాలి. కొబ్బరి చట్నీతో సర్వ్‌ చేసుకోవాలి.


Updated Date - 2021-01-23T18:54:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising