ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వీడిష్‌ మీట్‌ బాల్స్‌

ABN, First Publish Date - 2021-01-03T17:35:32+05:30

కోడిగుడ్లు - రెండు, బోన్‌లెస్‌ మటన్‌ - పావుకేజీ, క్రీమ్‌ - అరకప్పు, వైట్‌ శాండ్‌విచ్‌ బ్రెడ్‌ - ఒకటిన్నరకప్పు, వెల్లుల్లి రెబ్బలు - రెండు, మిరియాల పొడి - పావు టీస్పూన్‌,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: కోడిగుడ్లు - రెండు, బోన్‌లెస్‌ మటన్‌ - పావుకేజీ, క్రీమ్‌ - అరకప్పు, వైట్‌ శాండ్‌విచ్‌ బ్రెడ్‌ - ఒకటిన్నరకప్పు, వెల్లుల్లి రెబ్బలు - రెండు, మిరియాల పొడి - పావు టీస్పూన్‌, ఉప్పు - ఒకటిన్నర టీస్పూన్‌, బేకింగ్‌ పౌడర్‌ - రెండు టీస్పూన్లు.


సాస్‌ కోసం : వెన్న - రెండు టేబుల్‌స్పూన్లు, పిండి - రెండు టేబుల్‌స్పూన్లు, లో సోడియం చికెన్‌ బ్రాత్‌(చికెన్‌ వేసి ఉడికించిన నీళ్లు) - మూడు కప్పులు, లైట్‌ బ్రౌన్‌ షుగర్‌ - రెండు టేబుల్‌స్పూన్లు, క్రీమ్‌ - ఒక కప్పు, సోయా సాస్‌ - ఒకటిన్నర స్పూన్‌, మిరియాల పొడి - పావు టీస్పూన్‌, నిమ్మరసం - ఒక టేబుల్‌స్పూన్‌, కొత్తిమీర - గార్నిష్‌ కోసం కొద్దిగా.


తయారీ విధానం: ముందుగా ఓవెన్‌ను 325 డిగ్రీల ఫారన్‌హీట్‌కు  వేడి చేసుకోవాలి. ఒక బౌల్‌లో కోడిగుడ్లు కొట్టి వేయాలి. అందులో క్రీమ్‌, శాండ్‌విచ్‌ బ్రెడ్‌ ముక్కలు వేసి కలపాలి. మాంసం, వెల్లుల్లి రెబ్బలు, మిరియాలను మిక్సీలో వేసి, తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. మిశ్రమం మరీ పలుచగా కాకూడదు. గట్టిగానూ ఉండకూడదు. ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ బేకింగ్‌ షీట్‌లో వేసి 20 నిమిషాల పాటు ఓవెన్‌లో బేక్‌ చేయాలి. మీట్‌ బాల్స్‌ ఉడుకుతున్న సమయంలో సాస్‌ తయారుచేసుకోవాలి. వెడల్పాటి పాన్‌ స్టవ్‌పై పెట్టి వెన్న వేసి వేడి చేయాలి. తరువాత అందులో చికెన్‌ బ్రాత్‌ పోయాలి. కాసేపయ్యాక బ్రౌన్‌ షుగర్‌ వేసి కలపాలి. పదినిమిషాల పాటు ఉడికించుకుంటే సాస్‌ చిక్కగా అవుతుంది. ఇప్పుడు క్రీమ్‌, సోయా సాస్‌, మిరియాల పొడి వేసి మరి కాసేపు ఉడికించాలి. తరువాత ఓవెన్‌లో ఉడికించి పెట్టుకున్న మీట్‌ బాల్స్‌ వేయాలి. కాసేపు ఉడికిన తరువాత నిమ్మరసం పిండుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుని దింపాలి. వేడివేడిగా సర్వ్‌ చేయాలి.


Updated Date - 2021-01-03T17:35:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising