ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్బుల్‌ కేక్‌

ABN, First Publish Date - 2021-12-25T18:51:26+05:30

ఏ చిన్న సెలబ్రేషన్‌ అయినా ఇంట్లో కేక్‌ కట్‌ చేయాల్సిందే. అలాంటిది క్రిస్మస్‌, న్యూఇయర్‌ వేడుకల్లో తప్పక కేక్‌ రుచి చూడాల్సిందే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేక్‌ తిందామా..

ఏ చిన్న సెలబ్రేషన్‌ అయినా ఇంట్లో కేక్‌ కట్‌ చేయాల్సిందే. అలాంటిది క్రిస్మస్‌, న్యూఇయర్‌ వేడుకల్లో  తప్పక కేక్‌ రుచి చూడాల్సిందే.  అస్తమానం కేక్‌లు తయారీచేసే బేకరీలను నమ్ముకోకుండా.. మీ  ఇంట్లోనే సులువుగా ఇలా కేక్స్‌ తయారు చేసుకోండిలా... 


కావలసినవి: పెరుగు - ఒకకప్పు, పంచదార - ఒకకప్పు, నూనె - అరకప్పు, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - రెండు టీస్పూన్లు, మైదా - రెండు కప్పులు, బేకింగ్‌ సోడా - కొద్దిగా, బేకింగ్‌ పౌడర్‌ - ఒక టీస్పూన్‌, కోకో పౌడర్‌ - పావు కప్పు, ఉప్పు - తగినంత, ఒక బేకింగ్‌ టిన్‌. 


తయారీ విధానం: ఒక పాత్రలో పావుకప్పు పెరుగు తీసుకుని అందులో పావుకప్పు పంచదార, పావుకప్పు నూనె, ఒక టీస్పూన్‌ వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ వేసి పంచదార కరిగే వరకు బాగా కలియబెట్టాలి. తరువాత అందులో ఒకకప్పు మైదా, చిటికెడు బేకింగ్‌ సోడా, అర టీస్పూన్‌ బేకింగ్‌ పౌడర్‌, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొన్ని నీళ్లు పోసి మళ్లీ బాగా కలిపితే వెనీలా కేక్‌ మిశ్రమం రెడీ. మరొక పాత్రలో మిగిలిన పావుకప్పు పెరుగు తీసుకుని అందులో పావుకప్పు పంచదార, పావుకప్పు నూనె, ఒక టీస్పూన్‌ వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ వేసి పంచదార కరిగే వరకు కలియబెట్టాలి. అందులో ఒకకప్పు మైదా, కోకో పౌడర్‌, చిటికెడు బేకింగ్‌ సోడా, అర టీస్పూన్‌ బేకింగ్‌ పౌడర్‌, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి. తరువాత కొన్ని నీళ్లు పోసి మళ్లీ బాగా కలిపితే చాక్లెట్‌ కేక్‌ మిశ్రమం రెడీ. ఇప్పుడు కేక్‌ టిన్‌లో రెండు టేబుల్‌స్పూన్ల వెనీలా కేక్‌ మిశ్రమం వేయాలి. దానిపైన రెండు టేబుల్‌స్పూన్ల చాక్లెట్‌ కేక్‌ మిశ్రమం వేయాలి.  అలా లేయర్లుగా వేసుకోవాలి. తరువాత 180 డిగ్రీల సెల్సియ్‌సకు ప్రీహీట్‌ చేసిన ఓవెన్‌లో 50నిమిషాల పాటు బేక్‌ చేసుకోవాలి. తర్వాత కేక్‌ టిన్‌లో నుంచి తీసి ముక్కలుగా కట్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2021-12-25T18:51:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising