ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మల్‌పావు

ABN, First Publish Date - 2021-03-27T19:39:52+05:30

హోలీ అంటే రంగులు చల్లుకోవడమే కాదు, కమ్మటి రుచులను ఆస్వాదించాల్సిందే. ముఖ్యంగా థాండై, భాంగ్‌ పకోడా ఉంటే హోలీ మజా రెట్టింపవుతుంది. మల్‌పావు, బాదం ఫిర్నీ, రస్‌మలాయి, నమక్‌ పరెలు కూడా లొట్టలేయించేవే. మరి రంగుల పండుగ రోజున ఈ రెసిపీలను మీరూ రుచి చూడండి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రుచుల కేళి!

హోలీ అంటే రంగులు చల్లుకోవడమే కాదు, కమ్మటి రుచులను ఆస్వాదించాల్సిందే. ముఖ్యంగా థాండై, భాంగ్‌ పకోడా ఉంటే హోలీ మజా రెట్టింపవుతుంది. మల్‌పావు, బాదం ఫిర్నీ, రస్‌మలాయి, నమక్‌ పరెలు కూడా లొట్టలేయించేవే. మరి రంగుల పండుగ రోజున ఈ రెసిపీలను మీరూ రుచి చూడండి.


కావలసినవి: మైదా - ఒక కప్పు, బొంబాయి రవ్వ - అర కప్పు, పంచదార - పావుకప్పు, సొంపు - అర టీస్పూన్‌, యాలకుల పొడి - పావు టీస్పూన్‌, పాలు - అరకప్పు, నూనె - డీప్‌ ఫ్రైకి తగినంత, డ్రైఫ్రూట్స్‌ - గార్నిష్‌ కోసం.

పంచదార పానకం కోసం: పంచదార - ఒక  కప్పు, నీళ్లు - అరకప్పు, యాలకుల పొడి - పావు టీస్పూన్‌, కుంకుమ పువ్వు - కొద్దిగా.


తయారీ విధానం: ముందుగా ఒక పాత్రలో నీళ్లు పోసి పంచదార వేసి పానకం తయారుచేసుకోవాలి. యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలో మైదా, రవ్వ, పంచదార, సోంపు, యాలకుల పొడి వేసి కలపాలి. తరువాత పాలు పోస్తూ ఉండలు లేకుండా కలపాలి. కొద్దిగా నీళ్లు పోసి మిశ్రమం పలుచగా ఉండేలా చూసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అరగంట పాటు పక్కన పెట్టాలి. ఒక పాన్‌లో నూనె పోసి కాస్త వేడి అయ్యాక చెంచాతో మల్‌పావు మిశ్రమాన్ని వేయాలి. రెండు వైపులా గోధుమరంగులోకి మారే వరకు కాల్చాలి. తరువాత పంచదార పానకంలో వేయాలి. పది నిమిషాల తరువాత ప్లేట్‌లోకి మార్చి డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2021-03-27T19:39:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising