కొబ్బరి బెండీ కూటు
ABN, First Publish Date - 2021-02-12T19:24:14+05:30
బెండ కాయలు: పావు కిలో, కొబ్బరి కోరు: కప్పు, శెనగలు: పావు కప్పు, చింతపండు: 50 గ్రాములు, మజ్జిగ: కప్పు, శెనగపప్పు,
కావలసిన పదార్థాలు
బెండ కాయలు: పావు కిలో, కొబ్బరి కోరు: కప్పు, శెనగలు: పావు కప్పు, చింతపండు: 50 గ్రాములు, మజ్జిగ: కప్పు, శెనగపప్పు, మినప్పప్పు: మూడు స్పూన్లు, ధనియాలు: మూడు స్పూన్లు, పచ్చిమిర్చి: 6, కరివేపాకు: రెండు రెబ్బలు, నూనె: 50 గ్రాములు, తాలింపు గింజలు: మూడు స్పూన్లు
తయారు చేసే విధానం
శెనగల్ని నానబెట్టాలి. చింత పండు పులుసు తీసిపెట్టుకోవాలి. బెండ కాయల్ని ముక్కలుగా కోసిపెట్టుకోవాలి. ఓ గిన్నెలో మజ్జిగపోసి దాంట్లో బెండకాయ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. కొద్ది నూనెలో ధనియాలు, శెనగపప్పు, మినప్పప్పు ఒక్కోటి వేయించి పక్కనపెట్టుకోవాలి. కొబ్బరి, ఉప్పు కలిపి రుబ్బుకోవాలి. దీనికి వేయించిన ధనియాలు, శెనగపప్పు, మినప్పప్పు కలిపి గ్రైండ్ చేసిపెట్టుకోవాలి. ఈ మిశ్రమానికి చింతపండు పులుసు, ఉడికిన బెండకాయలు, శెనగలు కలిపి పసుపు, ఉప్పు వేసి ఉడికించాలి. ఆ తరవాత పోపు వేస్తే కొబ్బరి బెండీ కూటు రెడీ.
Updated Date - 2021-02-12T19:24:14+05:30 IST