ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దహీ కే కబాబ్‌

ABN, First Publish Date - 2021-12-11T19:01:58+05:30

నిజాం శైలితో పాటుగా కుంకుమ పువ్వు లాంటి రుచులను జోడించి నోటిలో వేసుకోగానే కరిగి పోయేలా ఈ పెరుగు కబాబ్‌కు కాస్త స్పైసీనెస్‌ జోడించి సంప్రదాయ దహీ కే కబాబ్‌ను తయారు చేసుకోవచ్చు. నలుగురికి సరిపడా వంటకం తయారీకి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజాం శైలితో పాటుగా కుంకుమ పువ్వు లాంటి రుచులను జోడించి నోటిలో వేసుకోగానే కరిగి పోయేలా ఈ పెరుగు కబాబ్‌కు కాస్త స్పైసీనెస్‌ జోడించి సంప్రదాయ దహీ కే కబాబ్‌ను తయారు చేసుకోవచ్చు. నలుగురికి సరిపడా వంటకం తయారీకి....


కావలసినవి: పెరుగు- 500 గ్రా, పనీర్‌- 75 గ్రా, జీడిపప్పు (వేయించి, నలగ్గొట్టినది)- 75గ్రా, కిస్‌మిస్‌ (సీడ్‌ లెస్‌)- 30 గ్రా, నెయ్యి- 10 మి.లీ, జీలకర్ర- 5 గ్రా, అల్లం - 5 గ్రా, పచ్చిమిర్చి- 5 గ్రా, పసుపు- 1 గ్రా, మెంతి పొడి- 5 గ్రా, జీలకర్ర పొడి- 5గ్రా, యాలకుల పొడి- 2 గ్రా, వేయించిన శనగపప్పు పొడి - 50 గ్రా, కొత్తిమీర- 15గ్రా, వేయించడానికి నెయ్యి - 15 మి.లీ లవంగాల పొడి - 5గ్రా, ఉప్పు- తగినంత.


తయారీ విధానం: ముందుగా ఓ రాగి పాత్రలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత అందులో జీలకర్ర వేసి వేయించాలి. తరువాత అల్లం వేయాలి. అనంతరం పచ్చిమిర్చి, పసుపు కూడా కలిపి అరనిమిషం ఉంచి దానిలో జీడిపప్పు, కిస్‌మిస్‌ కూడా వేసి మరికాసేపు వేయించాలి. ఉప్పు తగినంత వేసు కోవాలి. తరువాత ఈ మిశ్రమానికి  తరిగిన పనీర్‌, జీలకర్ర పొడి, మెంతి పొడి, లవంగాల పొడి కలిపి 10 నిమిషాలు ఉడికించాలి. ఆ తరువాత పొయ్యి మీద నుంచి దింపుకొని గది ఉష్ణోగ్రతకు చల్లబరచాలి. మిశ్రమం చల్లారిన తరువాత పెరుగు, వేయించిన శనగపప్పు పొడి, కొత్తిమీర కలపాలి. తరువాత ఈ  మిశ్రమాన్ని పట్టీల్లా చేసి కొంతసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. పాన్‌ తీసుకుని, దానిలో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేసిన తరువాత ఈ కబాబ్‌లను ఒకటిరెండు నిమిషాలు ఫ్రై చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2021-12-11T19:01:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising