ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోన్‌ అవాల్‌

ABN, First Publish Date - 2021-11-27T19:13:06+05:30

ఇప్పుడు ఎవరిని కదిలించినా ఇమ్యూనిటీ విషయంలో తగ్గేదేలె అంటున్నారు. ఉసిరి ఇమ్యూనిటీకి పవర్‌హౌజ్‌లాంటిది! విరివిగా లభించే ఈ సీజన్‌లో ఉసిరిని ఎంత తీసుకుంటే ఇమ్యూనిటీ అంత పెరుగుతుంది. ఉసిరితో చేసే కొన్ని రెసిపీలు ఇవి. ఆ రుచులను మీరూ ఆస్వాదించండి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉసిరికి సరిలేదు!

ఇప్పుడు ఎవరిని కదిలించినా ఇమ్యూనిటీ విషయంలో తగ్గేదేలె అంటున్నారు. ఉసిరి ఇమ్యూనిటీకి పవర్‌హౌజ్‌లాంటిది!  విరివిగా లభించే ఈ సీజన్‌లో ఉసిరిని ఎంత తీసుకుంటే ఇమ్యూనిటీ అంత పెరుగుతుంది. ఉసిరితో చేసే కొన్ని రెసిపీలు ఇవి. ఆ రుచులను మీరూ ఆస్వాదించండి.


వందగ్రాముల ఉసిరిలో..

విటమిన్‌ సి - 600 మి.గ్రా

క్యాలరీ - 50

ప్రొటీన్‌ - 0.5గ్రా

కార్బోహైడ్రేట్లు - 13.7గ్రా


ఉసిరిలో సి- విటమిన్‌ పుష్కలంగా లభిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచడంలో ఉసిరి బాగా ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర నిలువలను నియంత్రించడంలోనూ ఉసిరి సహాయపడుతుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఉసిరిలో ఉండే ఫైటోన్యూట్రియెంట్స్‌, యాంటీఆక్సిడెంట్లు జ్ఞాపకశక్తిని పెంచుతాయి.


కావలసినవి: ఉసిరికాయలు - అరకేజీ (వీటికి ఒక టీస్పూన్‌ ఉప్పు కలిపి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి), నూనె - పావుకేజీ, కరివేపాకు - కొద్దిగా, ఉల్లిపాయలు - పావుకేజీ, వెల్లుల్లి - 100గ్రా, బెల్లం - ఒకటేబుల్‌స్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత.


మసాలా కోసం: కశ్మీరీ కారం - 200గ్రా, లవంగాలు - ఒక టీస్పూన్‌, జీలకర్ర - ఒకటీస్పూన్‌, దాల్చినచెక్క - రెండు అంగుళాల ముక్క, అల్లం - కొద్దిగా, పసుపు - ఒక టీస్పూన్‌, వెల్లుల్లి - 100గ్రా, గోన్‌ వెనిగర్‌ - 250ఎంఎల్‌.


తయారీ విధానం: ముందుగా  మసాలా కోసం రెడీ చేసి పెట్టుకున్న పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి పేస్టులా తయారుచేసుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక కరివేపాకు వేయాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరిగిన ఉల్లిపాయలు వేసి గోధుమరంగులోకి మారే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయలు వేసి కలియబెట్టాలి. మూతపెట్టి చిన్నమంటపై పదినిమిషాలు ఉడికించాలి. తరువాత రెడీ చేసి పెట్టుకున్న మసాల పేస్టు వేసి ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. బెల్లం వేయాలి. తగినంత ఉప్పు వేసి కలియబెట్టాలి. మూతపెట్టి మరో పదినిమిషాలు ఉడికించాలి. స్టవ్‌పై నుంచి దింపి చల్లారనివ్వాలి. మిశ్రమం చల్లారిన తరువాత జాడీలోకి మార్చుకోవాలి. అన్నంలోకి లేదా రోటీతో తింటే రుచిగా ఉంటుంది.

Updated Date - 2021-11-27T19:13:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising