ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వీట్‌ పనియారం

ABN, First Publish Date - 2021-10-09T18:34:58+05:30

పండుగ అంటే ఇంట్లో వంటల ఘుమఘుమలు ఉంటాయి. ముఖ్యంగా దసరా పండుగ అంటే స్వీటు, హాటు రెండూ ఉండాల్సిందే. క్యారెట్‌ బొబ్బట్లు, స్వీట్‌ పనియారం, చిత్రాన్నం... ఈ వంటలను దుర్గామాతకు నైవేద్యంగా సమర్పించడంతో పాటు, ఇంటిల్లిపాది కమ్మని రుచులు ఆస్వాదించవచ్చు. పండుగ వేళ ఈ రెసిపీలను మీరూ ట్రై చేయండి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దసరా... నోరూరా..!

పండుగ అంటే ఇంట్లో వంటల ఘుమఘుమలు ఉంటాయి. ముఖ్యంగా దసరా పండుగ అంటే స్వీటు, హాటు రెండూ ఉండాల్సిందే. క్యారెట్‌ బొబ్బట్లు, స్వీట్‌ పనియారం, చిత్రాన్నం... ఈ వంటలను దుర్గామాతకు నైవేద్యంగా సమర్పించడంతో పాటు, ఇంటిల్లిపాది కమ్మని రుచులు ఆస్వాదించవచ్చు. పండుగ వేళ ఈ రెసిపీలను మీరూ ట్రై చేయండి. 

కావలసినవి: బియ్యప్పిండి - అరకప్పు, కొబ్బరి తురుము - అరకప్పు, బెల్లం - అరకప్పు, అరటిపండు ముక్కలు - అర కప్పు, యాలకులు - రెండు, నెయ్యి - కొద్దిగా, ఉప్పు - తగినంత.

తయారీ విధానం: ఒక బౌల్‌లో కొబ్బరి తురుము, అరటిపండు ముక్కలు, యాలకులు తీసుకోవాలి. వీటిని మిక్సీలో వేసి మెత్తగా పట్టుకోవాలి. అవసరమైతే ఒకటి రెండు చెంచాల నీళ్లు వేసుకోవచ్చు. తరువాత బెల్లం వేసి మరోసారి గ్రైండ్‌ చేసుకుని బౌల్‌లోకి మార్చుకోవాలి.ఇందులో తగినంత ఉప్పు వేసి, బియ్యప్పిండి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పనియారం పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి మిశ్రమం వేసుకోవాలి. చిన్నమంటపై మూతపెట్టి ఉడికించాలి. ఉడికిన తరువాత పనియారంలు తిప్పి మరికాసేపు ఉడికించాలి. చట్నీతో తింటే ఇవి రుచిగా ఉంటాయి. పండుగ రోజున పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు.

Updated Date - 2021-10-09T18:34:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising