ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లడ్డూలు

ABN, First Publish Date - 2021-04-17T18:25:48+05:30

పోషకాలతో నిండిన నువ్వులు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. వీటితో చేసిన వంటలు తింటే ఆరోగ్యం ఎంచక్కా ఉంటుంది. నువ్వులతో బర్ఫీ, చట్నీ, పులావు, పిల్లలు ఇష్టంగా తినే లడ్డూలు చేసుకోవచ్చు. మరి మీరూ నువ్వుల రుచులను ఆస్వాదించండి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నువ్వులు...పోషకాల దివ్వెలు

పోషకాలతో నిండిన నువ్వులు రోగనిరోధకశక్తిని పెంచుతాయి.  వీటితో చేసిన వంటలు తింటే  ఆరోగ్యం ఎంచక్కా ఉంటుంది. నువ్వులతో బర్ఫీ, చట్నీ, పులావు, పిల్లలు ఇష్టంగా తినే లడ్డూలు చేసుకోవచ్చు. మరి మీరూ నువ్వుల రుచులను ఆస్వాదించండి.


కావలసినవి: నువ్వులు - 100గ్రాములు, బెల్లం - 100గ్రాములు, యాలకుల పొడి - అర టీస్పూన్‌.


తయారీ విధానం: ముందుగా స్టవ్‌పె పాన్‌ పెట్టి నువ్వులను వేగించాలి. నువ్వులు మరీ ఎక్కువగా వేగకుండా చూసుకోవాలి. చిటపటమంటున్న సమయంలోనే దింపి ప్లేట్‌లోకి మార్చుకోవాలి. అదే పాన్‌లో కొద్దిగా నీళ్లు పోసి బెల్లం వేసి పానకం తయారుచేసుకోవాలి. తరువాత అందులో యాలకుల పొడి, నువ్వులు వేసి కలపాలి. మిశ్రమం చల్లారిన తరువాత కొద్దికొద్దిగా తీసుకుంటూ లడ్డూలు తయారుచేసుకోవాలి. గాలి తగలని జాడీలో పెట్టుకుంటే ఇవి నిల్వ ఉంటాయి. ఐరన్‌ సమృద్ధిగా లభించే ఈ లడ్డూలను పిల్లలు ఇష్టంగా తింటారు.

Updated Date - 2021-04-17T18:25:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising