ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బక్లావా

ABN, First Publish Date - 2021-06-26T20:32:55+05:30

ఈజిప్టియన్‌ లెంటిల్స్‌ - ఒక కప్పు, నెయ్యి - పావుకేజీ, అల్లం - 4 టీస్పూన్లు, ఉప్పు - తగినంత, గోధుమపిండి - ఒకకేజీ, పంచదార - రెండుకప్పులు, పిస్తా పలుకుల పొడి - 8 టీస్పూన్లు, దాల్చినచెక్క పొడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: ఈజిప్టియన్‌ లెంటిల్స్‌ - ఒక కప్పు, నెయ్యి - పావుకేజీ, అల్లం - 4 టీస్పూన్లు, ఉప్పు - తగినంత, గోధుమపిండి - ఒకకేజీ, పంచదార - రెండుకప్పులు, పిస్తా పలుకుల పొడి - 8 టీస్పూన్లు, దాల్చినచెక్క పొడి - అర టీస్పూన్‌, లవంగాల పొడి - అర టీస్పూన్‌, యాలకుల పొడి - అర టీస్పూన్‌. 


తయారీ విధానం: ముందుగా లెంటిల్స్‌ మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత నీళ్లను తీసివేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి ఉడికించిన లెంటిల్స్‌ను వేగించాలి. అల్లం, కొద్దిగా ఉప్పు వేయాలి. లెంటిల్స్‌ ఉడికేందుకు కొద్దిగా నీళ్లు పోయాలి. దాల్చినచెక్కపొడి, లవంగాల పొడి, యాలకుల పొడి వేయాలి. గోధుమపిండిని మెత్తగా కలిపి చిన్న చిన్న భాగాలుగా పెట్టుకోవాలి. ఒక్కో భాగాన్ని తీసుకుంటూ  నెయ్యి, పొడి పిండి వేసుకుంటూ పూరీలు ఒత్తుకోవాలి. పూరీపై లెంటిల్‌ మిశ్రమం కొద్దిగా వేసి పైన మరొకపూరీ వేయాలి. తిరిగి అదే పద్దతిలో కొద్దిగా లెంటిల్‌ మిశ్రమం వేసి పైన మళ్లీ ఒక పూరీ వేయాలి. తరువాత అన్నింటిని కలిపి గుండ్రంగా చుట్టాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి డీప్‌ ఫ్రై చేయాలి. పంచదార పానకం తయారుచేయాలి. ఫ్రై చేసిన బక్లావాలను పంచదార పానకంలో వేయాలి. పానకం ముక్కలకు పట్టాక పిస్తా పలుకులతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.


Updated Date - 2021-06-26T20:32:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising