ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవకాడో ఐస్‌క్రీం

ABN, First Publish Date - 2021-04-24T18:12:43+05:30

పాలు - అరలీటరు, పంచదార - తగినంత, అవకాడోలు - రెండు, క్రీమ్‌ - 200ఎంఎల్‌, నిమ్మరసం - ఒక టీస్పూన్‌, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - ఒక టీస్పూన్‌.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి : పాలు - అరలీటరు, పంచదార - తగినంత, అవకాడోలు - రెండు, క్రీమ్‌ - 200ఎంఎల్‌, నిమ్మరసం - ఒక టీస్పూన్‌, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - ఒక టీస్పూన్‌.


తయారీ విధానం: ముందుగా పాలు బాగా మరిగించాలి. ఎక్కువ సమయం మరిగిన తరువాత చిక్కబడిన పాలలో పంచదార వేసి కరిగించాలి. ఆ పాత్రను ఒక కవర్‌తో గాలి తగలకుండా మూసేసి గంట పాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. అవకాడోల పొట్టు తీయాలి. గింజలు లేకుండా తీసేయాలి. తరువాత ఒక పాత్రలోకి వాటిని తీసుకుని ఫ్రిజ్‌లో పెట్టిన పాలు, క్రీమ్‌, నిమ్మరసం, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ వేసి బ్లెండర్‌ సహాయంతో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఐస్‌క్రీమ్‌ మేకర్‌లోకి మార్చి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. సాయంత్రం వేళ చల్ల చల్లగా అవకాడో ఐస్‌క్రీమ్‌ తింటుంటే భలేగా అనిపిస్తుంది. 

Updated Date - 2021-04-24T18:12:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising