ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంజీర్‌ - కుబానీ కి టిక్కీ

ABN, First Publish Date - 2021-05-08T19:52:25+05:30

ఇఫ్తార్‌ విందు అంటే ఎండుద్రాక్ష, జీడిపప్పు, బాదం, పిస్తా పలుకులతో చేసే వంటలు ఉండాల్సిందే. వీటితోపాటు క్వినోవా ఖీర్‌, క్రిస్ప్‌ కర్డ్‌ రోల్‌, అంజీర్‌ - కుబానీ కి టిక్కీ వంటివి కోవిడ్‌ సమయంలో తక్షణ శక్తిని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇఫ్తార్‌ రుచులు.. కోవిడ్‌ సమయంలో కొత్తగా...

ఇఫ్తార్‌ విందు అంటే ఎండుద్రాక్ష, జీడిపప్పు, బాదం, పిస్తా పలుకులతో చేసే వంటలు ఉండాల్సిందే. వీటితోపాటు క్వినోవా ఖీర్‌, క్రిస్ప్‌ కర్డ్‌ రోల్‌, అంజీర్‌ - కుబానీ కి టిక్కీ వంటివి కోవిడ్‌ సమయంలో తక్షణ శక్తిని అందించడంతో పాటుగా... రుచిగా కూడా ఉంటాయి. ఆ ఇఫ్తార్‌ స్పెషల్‌ వంటలు ఎలా చేయాలో చూద్దాం.


అంజీర్‌లో పోషకాలు.. (100గ్రాలలో..)

క్యాలరీలు - 30

ప్రొటీన్లు - 0.3గ్రా

కార్బోహైడ్రేట్లు - 7.7గ్రా

ఫైబర్‌ - 1.2గ్రా


కావలసినవి: అంజీర్‌ - నాలుగు, కుబానీ (డ్రై అప్రికాట్స్‌) - నాలుగు, పచ్చిమిర్చి - మూడు, అల్లం - 80గ్రా, ఉల్లిపాయలు - 100గ్రా, కొత్తిమీర - 20గ్రా, ఛాట్‌ మసాల - 15గ్రా, పనీర్‌ - 200గ్రా, హంగ్‌కర్డ్‌ - 100గ్రా, శనగపిండి - 100గ్రా, ధనియాల పొడి - 15గ్రా, నూనె - సరిపడా, ఉప్పు - రుచికి తగినంత, మిరియాల పొడి - 5గ్రా.


తయారీ విధానం: ముందుగా అంజీర్‌, డ్రై  అప్రికాట్స్‌ను నానబెట్టి, తరువాత ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఒక పాత్ర తీసుకుని అందులో శనగపిండి, హంగ్‌ కర్డ్‌, పనీర్‌, మిరియాలపొడి, ధనియాలపొడి, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. అవసరమైతే కొన్ని నీళ్లు కలుపుకొని మెత్తటి మిశ్రమంలా చేసుకోవాలి. మరొక పాత్రలో అంజీర్‌, అప్రికాట్‌, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం, కొత్తిమీర, ఛాట్‌మసాల, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు సెనగపిండి, కర్డ్‌ మిశ్రమాన్ని తీసుకుని కొద్దిగా వెడల్పుగా చేసుకుని మధ్యలో రెండు, మూడు స్పూన్ల అంజీర్‌, అప్రికాట్‌ మిశ్రమాన్ని పెట్టి చివరలు దగ్గరకు అని మూసేయాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి కాస్త వేడి అయ్యాక కబాబ్‌లు వేసి వేగించాలి. వేడి  వేడి అంజీర్‌ - కుబానీ కి టిక్కీలను సర్వింగ్‌ ప్లేట్‌లోకి తీసుకోవాలి.



Updated Date - 2021-05-08T19:52:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising