‘రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ’లో వైఎస్‌ఆర్ కృషి
ABN, First Publish Date - 2021-03-19T08:19:20+05:30
కరీంనగర్ జిల్లా రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ అని అనిపించుకుంటోందంటే దాని వెనుక జలయజ్ఞం ద్వారా వైఎ్‌సఆర్ చేసిన కృషి ఉందని షర్మిల
కరీంనగర్ అభిమానుల ఆత్మీయ సమావేశంలో షర్మిల
హైదరాబాద్, మార్చి 18(ఆంధ్రజ్యోతి): కరీంనగర్ జిల్లా రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ అని అనిపించుకుంటోందంటే దాని వెనుక జలయజ్ఞం ద్వారా వైఎ్‌సఆర్ చేసిన కృషి ఉందని షర్మిల అన్నారు. ఈ ప్రభుత్వం కాళేశ్వరం గురించి గొప్పలు చెప్పుకుంటోందని, ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాగా పనిచేసే ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ వరద కాలువ, మిడ్ మానేరులను నిర్మించిన ఘనత వైఎ్‌సఆర్‌దేనన్నారు.
లోట్‌సపాండ్‌లో గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వైఎ్‌సఆర్ అభిమానులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ వైఎ్‌సఆర్‌కు కరీంనగర్ జిల్లాతో విడదీయరాని అనుబంధం ఉందన్నారు. ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు కరీంనగర్ జిల్లా రైతుల కష్టాలు చూసిన తర్వాతనే ఉచిత విద్యుత్తు హామీని ఇచ్చారని తెలిపారు. సిరిసిల్ల నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిసి ఒక్కో కుటుంబానికి రూ. లక్షన్నర ఆర్థిక సాయం చేశారని, బ్యాంకుల ద్వారా రుణాలూ ఇప్పించారన్నారు. రాజన్న సంక్షేమం మళ్లీ తీసుకురావాలన్నదే తన సంకల్పమని షర్మిల ప్రకటించారు. వైఎ్‌సఆర్ అభిమానులు తన తోడుండి.. చేయిచేయీ కలిపితే ఎంతటి కొండనైనా ఢీ కొట్టేందుకు తాను సిద్ధమని ప్రకటించారు.
Updated Date - 2021-03-19T08:19:20+05:30 IST