ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాంపల్లి కోర్టుకు విజయమ్మ, షర్మిల..కేసు విచారణ వాయిదా

ABN, First Publish Date - 2021-01-19T22:38:55+05:30

నాంపల్లి కోర్టుకు విజయమ్మ, షర్మిల..కేసు విచారణ వాయిదా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నాంపల్లి కోర్టుకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల హాజరయ్యారు. 2012లో పరకాల ఉప ఎన్నికల సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా రోడ్ షో నిర్వహించారు. ఈ కేసులో విజయమ్మ, షర్మిల మంగళవారం కోర్టుకు హాజరయ్యారు. విచారణను ఈ నెల 27వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.  


గత విచారణలో వైఎస్ విజయమ్మకు, షర్మిలకు కోర్టు సమన్లు జారీ చేసింది. వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలంటూ సమన్లలో కోర్టు పేర్కొంది. ఈ కేసులో ఏ1గా విజయమ్మ, ఏ2గా షర్మిల ఉన్నారు. ఇదే కేసులో కొండా సురేఖ దంపతులు నిందితులుగా ఉన్నారు. కానీ వారిద్దరు కోర్టుకు హాజరుకాలేదు. కొంత సమయం ఇస్తే హాజరవుతామని కొండ సురేఖ దంపతులు కోర్టును అభ్యర్థించారు. దీంతో ఈ నెల 27న కచ్చితంగా కోర్టుకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను పరకాల పోలీసులు కోర్టు ఎదుట ఉంచారు. 

Updated Date - 2021-01-19T22:38:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising