ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాదయాత్రకు విరామం తీసుకోనున్న షర్మిల.. కారణం ఇదేనా?

ABN, First Publish Date - 2021-11-10T23:51:30+05:30

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పాదయాత్రకు విరామం తీసుకోనున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించారు. 21 రోజుల పాదయాత్రలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పాదయాత్రకు విరామం తీసుకోనున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించారు. 21 రోజుల పాదయాత్రలో వందల సమస్యలు తెలుసుకున్నామన్నారు. గతంలో ప్రతీ గింజ కొంటామని చెప్పి ఇప్పుడు వడ్లు కొనబోమని చెప్పడం మాట తప్పడం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణలో 91 శాతం మంది రైతులు అప్పుల పాలైనట్లు సర్వే చెబుతున్నాయన్నారు. 


‘‘రైతులు పండించిన వడ్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12 నుంచి 72గంటల పాటు హైదరాబాద్‌లో ‘రైతు వేదన’ దీక్ష చేయబోతున్నాం. రైతులకు మా పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన మాట ప్రకారం చివరి గింజ వరకూ కొనుగోలు చేయాలి.’’ అని షర్మిల అన్నారు. 


‘‘ప్రజాప్రస్థానం 21 రోజులుగా దిగ్విజయంగా సాగింది.ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాజ్యాంగ విలువలను పాటిస్తూ..ఎన్నికల కమిషన్ నిబంధనలను గౌరవిస్తూ ఈరోజు నుంచి పాదయాత్ర తాత్కాలిక వాయిదా వేయడమైనది. కోడ్ ముగిసిన వెంటనే ప్రజాప్రస్థానం తిరిగి ప్రారంభమౌతుంది.’’ అని షర్మిల తెలిపారు. 






Updated Date - 2021-11-10T23:51:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising