ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాదాద్రి క్షేత్రంలో భక్తుల రద్దీ

ABN, First Publish Date - 2021-11-22T01:41:22+05:30

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. కార్తీకమాసంతో పాటు వారాంతపు సెలవు రోజు కావడంతో నృసింహుడి దర్శనానికి భక్తులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. కార్తీకమాసంతో పాటు వారాంతపు సెలవు రోజు కావడంతో నృసింహుడి దర్శనానికి భక్తులు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చారు. ఉదయం నుంచి చిరుజల్లులతో కూడిన వర్షం కురుస్తున్నా భక్తులతో దర్శన క్యూలైన్లు కిటకిటలాడాయి. క్షేత్ర సందర్శనకు విచ్చేసిన భక్తులతో  ఆలయ తిరువీధులు, సేవా మండపాలు, దర్శన క్యూలైన్లలో ఆఽధ్యాత్మిక వాతావరణం నెలకొంది.  స్వామివారి ధర్మదర్శనాలకు మూడు గంటలు, ప్రత్యేక దర్శనాలకు గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. బాలాలయంలో నిత్య కల్యాణోత్సవం, ఆర్జిత సేవలు, కొండకింద పాత గోశాలలోని వ్రత మండపంలో సత్యనారాయణ వ్రతపూజల్లో భక్తులు కుటుంబసమేతంగా పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారి ప్రసాదాల విక్రయాలు, వ్రత, ప్రత్యేక పూజలు, ప్రత్యేక దర్శనాలు తదితర సేవల ద్వారా స్వామి వారికి రూ.27.13 లక్షల ఆదాయం సమకూరింది. 

Updated Date - 2021-11-22T01:41:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising