ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాదాద్రి.. ఆధ్యాత్మిక శిల్పకళా నగరి

ABN, First Publish Date - 2021-02-06T09:15:35+05:30

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం కృష్ణ శిలలతో ఆధ్యాత్మిక, ఆహ్లాద శిల్పకళా నగరిగా రూపుదిద్దుకుంటోంది. యాదాద్రి సప్త రాజగోపురాలను, మాఢవీధులతో కూడిన యాదాద్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుది దశకు ఏనుగు బొమ్మల పనులు

శరవేగంగా విష్ణు పుష్కరిణి పనులు


యాదాద్రి టౌన్‌, ఫిబ్రవరి 5: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం కృష్ణ శిలలతో ఆధ్యాత్మిక, ఆహ్లాద శిల్పకళా నగరిగా రూపుదిద్దుకుంటోంది. యాదాద్రి సప్త రాజగోపురాలను, మాఢవీధులతో కూడిన యాదాద్రి ప్రధానాలయ డ్రోన్‌ చిత్రాన్ని యాదిగిరిగుట్ట ఆలయ అభివృద్ధి   ప్రాధికార సంస్థ (వైటీడీఏ) అధికారులు శుక్రవారం విడుదల చేశారు. అంతర్జాతీయ ఆధ్యాత్మిక క్షేత్రంగా ముస్తాబవుతున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కొండకు పడమటి దిశలో రిటైనింగ్‌ వాల్‌కు ఎలిఫెంట్‌ ప్యానెల్‌ అమర్చే (ఏనుగు బొమ్మలు) పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇక్కడ ఐదు భారీ ప్యానెళ్లను అమర్చనున్నారు. జీఆర్‌సీ (గ్లాస్‌ రెయిన్‌ ఫోన్స్‌ సిమెంట్‌) పద్ధతిలో ఈ ప్యానెల్‌ను రాజస్థాన్‌లోని బాగ్మేర్‌ కళా కేంద్రంలో రూపొందించారు.


ఇప్పటికే మూడు ప్యానెళ్లను అమర్చిన కార్మికులు మరో రెండింటిని త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. కొండ కింద విష్ణు పుష్కరిణి పనులను కూడా ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు వేగవంతం చేశారు. విష్ణు పుష్కరిణికి మూడు వైపులా ఘాట్‌లు, గ్రేట్‌ శ్లాబుల కోసం సెంట్రింగ్‌ పనులు నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఆర్‌సీసీ పనులతో పాటు విద్యుద్దీకరణ పనులను పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2021-02-06T09:15:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising