భార్యను హత్య చేసి కరోనాతో చనిపోయిందంటూ...
ABN, First Publish Date - 2021-07-03T18:37:44+05:30
ఇటీవల తిరుపతిలో ఓ వ్యక్తి భార్యను హతమార్చి కరోనాతో మృతి చెందిందంటూ ఆమె కుటుంబ సభ్యులను నమ్మించే యత్నం చేసి అడ్డంగా దొరికిపోయిన ఘటన మరువక ముందే..
హైదరాబాద్: ఇటీవల తిరుపతిలో ఓ వ్యక్తి భార్యను హతమార్చి కరోనాతో మృతి చెందిందంటూ ఆమె కుటుంబ సభ్యులను నమ్మించే యత్నం చేసి అడ్డంగా దొరికిపోయిన ఘటన మరువక ముందే మరో ఘటన హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో చోటు చేసుకుంది. విజయ్, కవిత దంపతులు వనస్థలిపురంలో నివాసముంటున్నారు. కాగా.. భార్య కవితని హత్య చేసి కరోనాతో మృతి చెందినట్టు విజయ్ ఆమె కుటుంబ సభ్యుల్ని నమ్మించే యత్నం చేశాడు. భార్య మృతదేహాన్ని సొంత గ్రామం అయిన మిర్యాలగూడ పిల్ల గుంట్ల తాండకి తీసుకుని వెళ్లి అంత్యక్రియలు చేయించాడు. భర్త ప్రవర్తనపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. తమ కూతురు మృతిపై అనుమానాలున్నాయంటూ కవిత తల్లిదండ్రులు వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కవిత మృతదేహానికి పోలీసులు రీ పోస్టుమార్టం నిర్వహించారు. కవిత కరోనాతో చనిపోలేదని పోస్టుమార్టం చేసిన వైద్యులు తేల్చారు. దీంతో కరోనా పేరు చెప్పి భార్యను హత్య చేసిన విజయ్‌ని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.
Updated Date - 2021-07-03T18:37:44+05:30 IST