ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైడ్రామా.. Teenmar Mallanna విచారణకు ఎందుకు హాజరుకాలేదు.. హార్డ్‌ డిస్కుల్లో ఏముంది..!?

ABN, First Publish Date - 2021-08-07T16:00:10+05:30

చింతపండు నవీన్‌కుమార్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్న విషయంలో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కరోనా పరీక్షలకు వెళ్తున్నానని పోలీసులకు సమాచారం
  • వేధిస్తున్నారని కోర్టులో పిటిషన్‌

హైదరాబాద్ సిటీ/హిమాయత్‌నగర్‌ : చింతపండు నవీన్‌కుమార్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్న విషయంలో శుక్రవారం హైడ్రామా చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం బోడుప్పల్‌లోని మల్లన్నకు చెందిన క్యూ- న్యూస్‌ యూట్యూబ్‌ చానెల్‌ కార్యాలయంలో హైదరాబాద్‌ సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు సోదాలు నిర్వహించి హార్డ్‌ డిస్క్‌లు, ఇతర మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఓ యువతి ఫిర్యాదు మేరకు మల్లన్నపై కేసు నమోదు చేశారు. అదేరోజు ఆయనకు నోటీసులు జారీ చేశారు.


శుక్రవారం సైబర్‌క్రైమ్‌ పీఎస్‌లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. తాను అనారోగ్యానికి గురయ్యాయని, కరోనా పరీక్ష చేయించుకునేందుకు వెళ్తున్నానని, విచారణకు హాజరు కాలేనని పోలీసులకు సమాచారం ఇచ్చి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. విచారణ పేరుతో వేధించే ప్రయత్నం చేస్తున్నారని, ఒక కేసు విచారణలో ఉండగానే మరో కేసులో విచారణకు పిలుస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, సైబర్‌క్రైమ్‌ పోలీసులు జారీ చేసిన నోటీసును రద్దు చేయాలని మల్లన్న తన పిటీషన్‌లో కోర్టును కోరినట్లు సమాచారం.

Updated Date - 2021-08-07T16:00:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising