ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

ABN, First Publish Date - 2021-11-06T00:29:04+05:30

రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకే విక్రయించాలని, దాని కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసినకొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డిరూరల్‌ : రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకే విక్రయించాలని, దాని కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసినకొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ అన్నారు. రైతులు ఒకే రకమైన పంటలుసాగుచేయకుండా వాణిజ్య పంటలను కూడా పండించాలని అన్నారు. శుక్రవారం కామారెడ్డిలోని క్యాసం పల్లి తండాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి వుందన్నారు. కాబట్టి రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటుచేసినకొనుగోలుకేంద్రంలోనే ధాన్యం విక్రయించాలన్నారు.


తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం సేకరించనున్నదని చెప్పారు. రైతులను కొందరు దళారులు మభ్య పెడుతున్నట్టు తెలిసిందన్నారు. అలాంటి వారి పట్ల కఠినచర్యలు తీసుకుంటామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలుకు వ్యతిరేకించినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవతో నెలకొల్పిన కొనుగోలు కేంద్రాలు సక్రమంగా నడుస్తున్నాయని పేర్కొన్నారు. కేసీఆర్‌ లాంటి ముఖ్యమంత్రి ఉన్నంత కాలం తెలంగాణ రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన అన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు సుగుణ, కాసర్ల శ్రీనివాస్, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ బండారి నర్సారెడ్డి, రైతు సమన్వయ కమిటీ గ్రామ అధ్యక్షుడు బండారి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-06T00:29:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising