ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోలాహలంగా జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలు

ABN, First Publish Date - 2021-10-25T06:12:19+05:30

కోలాహలంగా జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 హనుమకొండ స్పోర్ట్స్‌, ఆక్టోబరు 24: అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో కాజీపేటలోని సెయింట్‌గ్యాబ్రెల్‌ హైస్కూల్‌ క్రీడా మైదానంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్థాయి సబ్‌ జూనియర్స్‌ బాల బాలికల అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలు ఆదివారం కోలాహలంగా ప్రారంభమయ్యాయి. ఈకార్యక్రమానికి అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి సారంగపాణి ముఖ్య అతిధిగా హాజరై పోటీలను లాంఛనంగా ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అండర్‌- 10, 12, 14 బాలబాలికల విభాగంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా సుమారు 300 మంది క్రీడాకారు లు పాల్గొంటున్నారన్నారు. ఇక్కడ జిల్లాస్థాయిలో ప్రతి భ కనబర్చిన క్రీడాకారులు ఈ నెల 31న ఖమ్మం జిల్లా కేంద్రంలో జరగనున్న రాష్ట్ర స్థాయి సబ్‌జూనియ ర్స్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌ప పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో సెయింట్‌గ్యాబ్రెల్‌ హైస్కూల్‌ పిఈటి విజయ్‌కుమార్‌, పిడి వాసుదేవరెడ్డి, అసోసియేషన్‌ బాధ్యులు పాల్గొన్నారు. 

ఎంపికైన క్రీడాకారులు వీరే..

అండర్‌-10 బాలుర విభాగంలో ఎం.జంపన్న, జి.బబ్లు, బాలికల విభాగంలో ఎస్‌కె. అమీరా, కె.అనూష, అండర్‌-12 బాలుర విభాగంలో జె.రుషికేశ్‌, హరి,  బాలికల విభాగంలో ప్రణీత, జోష్న, సంయుక్త, సానియా అండర్‌-14 బాలుర విభాగంలో సందీప్‌, బాలికల విభాగంలో దీపికలు ఎంపికయ్యారు. 

Updated Date - 2021-10-25T06:12:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising