సంక్షేమ పథకాల అమలులో ఎస్‌హెచ్‌జీలదే కీలకపాత్ర
ABN, First Publish Date - 2021-08-11T05:16:12+05:30
సంక్షేమ పథకాల అమలులో ఎస్‌హెచ్‌జీలదే కీలకపాత్ర
వరంగల్ సిటీ, ఆగస్టు 10: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ఫలాలు ప్రజలకు చేరడంలో మహిళా సంఘాల పాత్ర కీలకమని జీడబ్ల్యూఎంసీ మేయర్ గుండు సుధారాణి అన్నారు. మంగళవారం వరంగల్ జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో మెప్మా సిబ్బందితో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. టౌన్ లెవెల్, స్లమ్ లెవెల్ ఫెడరేషన్ నెలవారీ సమావేశాలు, జాబ్ చార్ట్ రూపొందించాలని ఆదేశించారు. ఈ మేరకు కమ్యూనిటీ ఆర్గనైజర్లు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో నెలలో మొదటి శనివారం శానిటేషన్ సిబ్బందికి, రెండో శనివారం వృద్ధులు, మూడో శనివారం వీధి వ్యాపారులు, నాలుగో శనివారం స్వయం సంఘాల మహిళాలకు హెల్త్ క్యాంపులు తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 632 మహిళా సంఘాల సభ్యుల పిల్లలకు స్కిల్ డెవల్‌పమెంట్‌లో శిక్షణ ఇప్పించామని తెలిపారు. శిక్షణ పొందిన వారిలో 236మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పొందినట్లు మేయర్ వివరించారు. పీఎం స్వానిధి ద్వారా రుణాల పంపిణీ లో దేశంలోనే వరంగల్ ప్రథమ స్థానంలో నిలవ డం అభినందనీయమన్నారు. సమావేశంలో టౌన్ ప్రాజెక్టు ఆఫీసర్ విజయలక్ష్మి, డీఎంసీ రజిత రాణి, టీఎంసీ రమేష్, సీవోలు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-08-11T05:16:12+05:30 IST