ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాగల 72 గంటల్లో అతి భారీ వర్షాలు

ABN, First Publish Date - 2021-07-13T16:49:10+05:30

రాగల 72 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని నగరంలోని వాతావరణ కేంద్రం తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాగల 72 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని నగరంలోని వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటనలో పేర్కొంది. ఈ మూడు రోజులు ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు ఉంటాయని చెప్పింది. గంటకు 30 నుంచి 40కిమీ. వేగంతో కూడిన గాలులు వీస్తాయని తెలిపింది. 


ఇదిలా ఉంటే, నిన్న ఏర్పడిన  అల్పపీడనం పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతం పరిసరాలలో ఉన్న ఉత్తర ఆంధ్రా, దక్షిణ ఒడిస్సా తీరం దగ్గర  స్థిరంగా కొనసాగుతుందని తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా మధ్య ట్రోపోస్పీయర్ స్థాయి వరకు వ్యాపించి ఎత్తుకి వెళ్ళే కొలదీ నైరుతి వైపుకు వంపు తిరిగి స్థిరముగా ద్రోణి కొనసాగుతున్నట్టు చెప్పింది.


తూర్పు - పశ్చిమ ద్రోణి/షేర్ జోన్ ఈ రోజు సుమారు  Lat 18°N లాటిట్యూడ్ వెంబడి సముద్ర మట్టానికి 3.1 కి మీ నుంచి 5.8 కిమీ. మధ్య కొనసాగుతూ  ఎత్తుకి వెళ్ళే కొలదీ దక్షిణ వైపుకి వంపు తిరిగి ఉందని ప్రకటనలో తెలియజేసింది. కుచ్ నుంచి ఉత్తర మధ్య మహారాష్ట్ర, విదర్భ, దక్షిణ ఛత్తీస్గఢ్, ఉత్తర కోస్తా ఆంధ్రా మీదగా అల్పపీడన ప్రాంతం వరకు ద్రోణి వ్యాపించి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Updated Date - 2021-07-13T16:49:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising