ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేఎంసీలో కరోనా కలకలం

ABN, First Publish Date - 2021-04-17T05:28:57+05:30

కేఎంసీలో కరోనా కలకలం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

8 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్‌


హన్మకొండ అర్బన్‌, ఏప్రిల్‌ 16: వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కళాశాలలో కరోనా కలకలం సృష్టించింది. మొదటి సంవత్సరం పూర్తిచేసుకున్న 8 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గురువారం 193 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 8మందికి పాజిటివ్‌గా తేలింది. నలుగురు విద్యార్థులను ఎంజీఎం కొవిడ్‌-19 విభాగంలో చేర్చారు. వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితులకు ఆక్సిజన్‌, వెంటిలేటర్లు, మందులను అందుబాటులో ఉంచినట్లు ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగార్జునరెడ్డి తెలిపారు. బాధితుల్లో ఏడుగురు విద్యార్థులు ఇప్పటికే రెండోడోసు కరోనా వ్యాక్సిన్‌ కూడా తీసుకొని ఉన్నారు. దీంతో అధికారులు, వైద్యులు ఆందోళన చెందుతున్నారు. మరో వైద్యవిద్యార్థి కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు కేఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంధ్య తెలిపారు. 

Updated Date - 2021-04-17T05:28:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising