ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలగర్భంలో కారాగారం!

ABN, First Publish Date - 2021-06-14T09:27:12+05:30

వరంగల్‌ కేంద్ర కారాగారం.. కాలగర్భంలో కలిసిపోయింది! 135 ఏళ్ల చరిత్ర కలిగిన జైలు గోడలు కూలిపోయాయి! సెంట్రల్‌ జైలు పూర్తిగా కనుమరుగైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్‌జైలు నేలమట్టం.. భూమి వైద్య శాఖకు అప్పగింత

వరంగల్‌ అర్బన్‌ క్రైం, జూన్‌ 13: వరంగల్‌ కేంద్ర కారాగారం.. కాలగర్భంలో కలిసిపోయింది! 135 ఏళ్ల చరిత్ర కలిగిన జైలు గోడలు కూలిపోయాయి! సెంట్రల్‌ జైలు పూర్తిగా కనుమరుగైంది. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి కోసం వరంగల్‌ కేంద్ర కారాగారాన్ని తరలిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గత కొన్ని రోజుల నుంచి ఖైదీలను, సామగ్రిని తరలించారు. శనివారం నుంచి భారీ భద్రత నడుమ జైలు భవనాల కూల్చివేతను చేపట్టారు. ఆదివారం పూర్తి స్థాయిలో నేలమట్టం చేశారు. దేశంలోనే అత్యాధునిక, పటిష్ఠ భద్రతతో నిర్మించిన కారాగారాల్లో వరంగల్‌ సెంట్రల్‌ జైలు ముందు వరుసలో ఉంటుంది. 6వ నిజాం మీర్‌ మహబూబ్‌ అలీ ఖాన్‌ పాలనలో 1886లో హన్కిన్‌ అనే అధికారి ఈ జైలు నిర్మాణాన్ని చేపట్టారు. పీపుల్స్‌వార్‌ వ్యవస్థాపకులైన కాసు సన్యాల్‌, కాళోజీ, దాశరథి, మావోయిస్టు అగ్రనేత గణపతి లాంటి ఎందరినో ఈ జైల్లో ఉంచారు. వరంగల్‌ జైలు కూల్చివేత ప్రక్రియను భారీ బందోబస్తు నడుమ చేపట్టారు. జైలు కూల్చివేస్తే రోడ్డుపై ట్రాఫిక్‌ ఆంక్షలు ఎందుకని స్థానికులు మండిపడ్డారు. 

Updated Date - 2021-06-14T09:27:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising