ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జలదిగ్బంధంలో ఓరుగల్లు

ABN, First Publish Date - 2021-09-08T17:59:41+05:30

కుండపోత వర్షంతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెరువును తలపించిన హంటర్‌రోడ్డు, పరిసర ప్రాంతాలు

ముంపు ప్రాంతాలను సందర్శించిన మేయర్‌, కమిషనర్‌


వరంగల్‌ సిటీ: కుండపోత వర్షంతో వరంగల్‌ నగరం నీట మునిగింది. నలువైపులా జలదిగ్బంధంలో చిక్కుకుంది. ముంపు ప్రాంతాల ప్రజలు నానా అవస్థలు పడ్డారు. కొందరు నగరం విడిచి వెళ్లారు. మరికొందరు పరిచయస్తుల ఇళ్లలో తలదాచుకున్నారు. ఇంకొందరు బంధువుల ఇళ్లకు చేరారు. కొందరు జీడబ్ల్యూఎంసీ పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు. భోజనం కోసం ఆధారపడాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. వరంగల్‌లోని సంతో్‌షమాతనగర్‌ కాలనీ, మైసయ్యనగర్‌, లక్ష్మీ గణపతి కాలనీ, ఎన్‌టీఆర్‌ నగర్‌, బృం దావన్‌ కాలనీ, మధురానగర్‌, సాయినగర్‌, కాశికుంట, బీఆర్‌ నగర్‌, సీఆర్‌నగర్‌, నజరేతుపురం, కాశిబుగ్గ, హనుమకొండలోని ఇంద్రానగర్‌, విద్యానగర్‌, పోచమ్మకుంట, సమ్మయ్యనగర్‌, టీవీ టవర్‌ కాలనీ, రాజాజీనగర్‌, భీమారం, పెద్దమ్మగడ్డ, జులైవాడ ఇందిరమ్మ కాలనీ, కాజీపేట, సోమిడి తదితర ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. బాలసముద్రం మార్కెట్‌, వడ్డెపల్లి రోడ్డు తులసీ బార్‌, కాజీపేట దర్గా ప్రాంతాల్లో చెట్లు కూలాయి. డీఆర్‌ఎఫ్‌ సభ్యులు చెట్లను తొలగించారు. మేయర్‌ గుండు సుధారాణి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ పి.ప్రావీణ్య మంగళవారం ఉదయం ముంపు ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలు చేపట్టారు.

Updated Date - 2021-09-08T17:59:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising