కాగజ్నగర్..చారిగాం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం
ABN, First Publish Date - 2021-06-27T14:46:26+05:30
పెద్దపులి కొమురంభీం జిల్లా ప్రజలకు నిద్రలేకుండా చేస్తోంది. కాగజ్ నగర్ మండలంలోని చారిగాం అటవీ ప్రాంతంలో పెద్దపులి హల్ చల్ చేస్తోంది. పెద్దపులి సంచరిస్తూ
కొమురంభీం: పెద్దపులి కొమురంభీం జిల్లా ప్రజలకు నిద్రలేకుండా చేస్తోంది. కాగజ్ నగర్ మండలంలోని చారిగాం అటవీ ప్రాంతంలో పెద్దపులి హల్ చల్ చేస్తోంది. పెద్దపులి సంచరిస్తూ..ఒక ఆవుపై దాడి చేసింది. పెద్దపులి దాడిలో ఆవు మృతి చెందింది. పెద్దపులి పట్టుకునేందుకు అటవీశాఖ సిబ్బంది సీసీ కెమెరాలు అమర్చి వస్తుండగా..అటవీశాఖ సిబ్బందికి పులి ఎదురుపడింది. దీంతో అక్కడున్న పశువుల కాపరులు అరవడంతో పెద్దపులి అక్కడి నుంచి పారిపోయింది. అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు పులిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు.
Updated Date - 2021-06-27T14:46:26+05:30 IST