వరంగల్ అర్బన్ జిల్లా ఓటర్ల సంఖ్య 7,37,739
ABN, First Publish Date - 2021-01-16T05:04:45+05:30
వరంగల్ అర్బన్ జిల్లా ఓటర్ల సంఖ్య 7,37,739
పురుషులు 3,65,395, స్త్రీలు 3,72,167, ఇతరులు 177
వరంగల్ అర్బన్ కలెక్టరేట్, జనవరి 15: వరంగల్ అర్బన్ జిల్లా ఓటర్ల సంఖ్య 7,37,739గా నమోధైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టిన అనంతరం ఈనెల 15న జిల్లా ఓటర్ల తుది జాబితా ప్రకటించింది. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఓటర్ల జాబితాను ప్రకటించింది. ఈ సమావేశంలో డీఆర్వో వాసుచంద్ర, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈవీ శ్రీనివాస రావు(కాంగ్రెస్), ఇ.నాగేశ్వర్రావు(టీఆర్ఎస్), బిక్షపతి(సీపీఐ) పాల్గొన్నారు.
నియోజక వర్గాల వారీగా
నియోజక వర్గం ఫురుషులు స్త్రీలు ఇతరులు మొత్తం
వరంగల్ పశ్చిమ 131342 132220 12 263574
వరంగల్ తూర్పు 113582 118080 156 231818
వర్ధన్నపేట 120471 121867 9 242347
మొత్తం ------------------------------------------
365395 372167 177 737739
Updated Date - 2021-01-16T05:04:45+05:30 IST