ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్కెట్‌కు తగ్గిన కూరగాయల సరఫరా!

ABN, First Publish Date - 2021-10-28T21:25:04+05:30

గత కొన్నిరోజులుగా మార్కెట్‌లకు కూరగాయల దిగుమతులు తగ్గాయి. దీంతో ఇప్పటికే ధరలు పెరిగిపోవడంతో ఆందోళన చెందుతున్న సామాన్య ప్రజలకు ఇప్పుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: గత కొన్నిరోజులుగా మార్కెట్‌లకు కూరగాయల దిగుమతులు తగ్గాయి. దీంతో ఇప్పటికే ధరలు పెరిగిపోవడంతో ఆందోళన చెందుతున్న సామాన్య ప్రజలకు ఇప్పుడు మళ్లీ ధరలు పెరుగుతాయన్న ఆందోలన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్‌ లోని మార్కెట్‌లు, రైతుబజార్లకు ప్రతి నిత్యం వచ్చే కూరగాయల్లో దాదాపు 30శాతానికి పైగా తగ్గినట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికే టమాటా మార్కెట్‌లో చాలా తక్కువ లభిస్తోంది. ఽరిటైల్‌ మార్కెట్‌లో కిలోకు 40 నుంచి 50 రూపాయలు పలుకుతోంది. నగరానికి రోజుకు 150 నుంచి 180 లారీల టమాటా డిమాండ్‌ ఉంటే ప్రస్తుతం 120 లారీలు కూడా రావడం లేదని సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లోని వ్యాపారి వెంకటేశం పేర్కొన్నారు. గత కొన్నిరోజులు క్రితం కురిసిన వర్షాలకు టమాటా పంట పాడైపోవడం వల్ల కూడా దిగుమతి తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. 


కొత్త పంట మార్కెట్‌కు రావడానికి మరో రెండు వారాల సమయం పడుతుందని తెలిపారు. ఇక మహా రాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు దిగుమి అయ్యే ఆలుగడ్డ కూడా సరఫరాలో 25 శాతం మేరకు తగ్గిందని గుడిమల్కాపూర్‌కు మార్కెట్‌కు చెందిన రాజారెడ్డి తెలిపారు. నగరానికి రోజుకు 100 నుంచి 150 లారీల ఆలు వస్తుండగా ప్రస్తుతం 100 లారీలు కూడా సరిగ్గా రావడం లేదని తెలిపారు. మహారాష్ట్రలో ఇటీవల కురిసిన వర్షాలే కారణమని వ్యాపారులుచెబుతున్నారు. కూరగాయల్లో ముఖ్యమైన వంకాయలు, బెండకాయ, చిక్కుడు, బిన్నీసు వంటివి కూడా సరాఫరా కూడా తక్కువగానే ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా చిక్కుడు, గోకరకాయ వంటివి డిమాండ్‌లో 50శాతం కూడా మార్కెట్‌కు రావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. వర్షాల కారణంగా గత కొన్నిరోజులుగా మార్కెట్‌కు వచ్చే కూరగాయలు తగ్గడం వల్ల వాటి ధరులు పెరుగుతున్నాయని వ్యాపారులుచెబుతున్నారు. మరో రెండు వారాల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని అంటున్నారు. 

Updated Date - 2021-10-28T21:25:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising