ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vemulawada శ్రీరాజరాజేశ్వర క్షేత్రంలో భక్తుల రద్దీ

ABN, First Publish Date - 2021-12-02T12:08:15+05:30

దక్షిణ కాశీ వేములవాడ శ్రీరాజరాజేశ్వర క్షేత్రం బుధవారం భక్తులతో రద్దీగా మారింది. కార్తీకమాసం సందర్భంగా శ్రీస్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వేములవాడకు తరలివచ్చారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజన్న సిరిసిల్ల: దక్షిణ కాశీ వేములవాడ శ్రీరాజరాజేశ్వర క్షేత్రం బుధవారం భక్తులతో రద్దీగా మారింది. కార్తీకమాసం సందర్భంగా శ్రీస్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వేములవాడకు తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు ఆలయ కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి శ్రీస్వామివారిని దర్శించుకుని కోడెమొక్కు చెల్లించుకున్నారు. శ్రీస్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం, అమ్మవారి కుంకుమపూజ తదితర ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు.

అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ దేవాలయంలో భక్తులతో సందడిగా మారింది. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి బోనం మొక్కు చెల్లించారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో కృష్ణప్రసాద్‌ నేతృత్వంలో అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ బి.సత్యప్రసాద్‌ శ్రీస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆశీర్వచనం గావించగా, ఈవో కృష్ణప్రసాద్‌ ప్రసాదం అందజేశారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి శ్రీస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు.  

Updated Date - 2021-12-02T12:08:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising