ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హరితహారంలో నాటిన మొక్కల పరిశీలన షురూ

ABN, First Publish Date - 2021-09-02T00:37:23+05:30

తెలంగాణకు హరితహారంలో భాగంగా నాటిన మొక్కల పరిశీలన కార్యక్రమాన్ని అటవీశాఖ అధికారులు ప్రారంభించారు. ఈ మేరకు రాండమ్ సర్వేలో భాగంగా అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ మేడ్చల్ జిల్లాలో పర్యటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణకు హరితహారంలో భాగంగా నాటిన మొక్కల పరిశీలన కార్యక్రమాన్ని అటవీశాఖ అధికారులు ప్రారంభించారు. ఈ మేరకు రాండమ్ సర్వేలో భాగంగా అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ మేడ్చల్ జిల్లాలో పర్యటించారు. బోడుప్పల్ కార్పోరేషన్ పరిధిలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన ప్రదేశాలను తనిఖీ చేశారు. అలాగే భాగ్యనగర్ సందనవనం అర్బన్ ఫారెస్ట్ పార్కులో గడ్డి మైదానాల అభివృద్ది, జింకల పార్కు సౌకర్యాలను పరిశీలించారు. గత రెండేళ్లలో వివిధ ప్రాంతాల్లో నాటిన మొక్కలు, బతికిన శాతంపై ఆరా తీశారు.


 పలువురు కాలనీ వాసులతో మాట్లాడి వారికి మొక్కలు అందాయో లేదో తెలుసుకుని, ఇళ్లలో నాటిన మొక్కల సంరక్షణకు తీసుకుంటున్నచర్యలపై చర్చించారు. వరంగల్ జాతీయ రహదారి వెంట నాటిన ఎవెన్యూ ప్లాంటేషన్ ను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో నాటిన మొక్కల్లో 90 శాతానికి పైగా బతకటంతో పాటు, చక్కగా ఎదిగినతీరుపై పీసీసీఎఫ్ సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బోడుప్పల్ డిప్యూటీ మేయర్ లక్ష్మి, కమిషనర్ శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా అటవీ అధికారి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-02T00:37:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising