ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖైదీలకు వ్యాక్సినేషన్‌

ABN, First Publish Date - 2021-05-06T07:58:34+05:30

రాష్ట్రంలోని జైళ్లల్లో విచారణ, శిక్ష పడ్డ ఖైదీల్లో 45 ఏళ్లు దాటిన వారందరికీ జైలు అధికారులు కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ ఇప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

80 శాతం మందికి మొదటి డోసు పూర్తి 


హైదరాబాద్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని జైళ్లల్లో విచారణ, శిక్ష పడ్డ ఖైదీల్లో 45 ఏళ్లు దాటిన వారందరికీ జైలు అధికారులు కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ ఇప్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర కారాగారాలు, జిల్లా జైళ్లు, సబ్‌ జైళ్లల్లో మొత్తం 6941 మంది ఖైదీలున్నారు. వారిలో సుమారు 430 మంది మహిళా ఖైదీలున్నారు. నిబంధనల ప్రకారం 45 ఏళ్లు దాటిన ఖైదీల్లో సుమారు 80ు మందికి ఇప్పటికే మొదటి డోసు వ్యాక్సిన్‌ ఇప్పించారు. త్వరలోనే రెండో డోసు ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక 18 సంవత్సరాలు పైబడ్డ ఖైదీల వ్యాక్సినేషన్‌ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు జైళ్ల శాఖ అధికారులు తెలిపారు. కాగా, జైళ్లల్లో కొవిడ్‌ వ్యాప్తికి ఆస్కారం లేకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొత్తగా వచ్చే ఖైదీలకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించి నెగిటివ్‌ ఉంటేనే జైళ్లలోకి అనుమతిస్తున్నారు. మొదట 14 రోజులు ప్రత్యేక బ్యారెక్‌లో ఐసోలేషన్‌లో ఉంచిన తర్వాత ఆరోగ్యం నిలకడగా ఉంటే రెగ్యులర్‌ జైల్లో మిగతా ఖైదీలతో కలిపి ఉంచుతున్నారు. భౌతిక దూరం పాటించే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

Updated Date - 2021-05-06T07:58:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising