ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదానీ‌ , అంబానీ చేతిలో మోదీ కీలుబొమ్మ: వీహెచ్

ABN, First Publish Date - 2021-03-09T20:41:54+05:30

ఆదానీ‌, అంబానీ చేతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలుబొమ్మలా మారారని మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఎద్దేవా చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఆదానీ‌, అంబానీ చేతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలుబొమ్మలా మారారని మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఎద్దేవా చేశారు. మంగళవారం హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్మేస్తున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం దారుణమన్నారు. విశాఖ స్టీల్ భూములు కోట్ల రూపాయలు పలుకుతుందని చెప్పారు. ఆదానీ, అంబానీలతో మోదీ అవగాహన కుదుర్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు ఉండవని చెప్పారు. 


రేపు బీ.హెచ్.ఈ.ఎల్, ఈసీఐఎల్ అమ్మేస్తారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ సంస్థలను కాపాడుకోవడానికి పెద్ద ఉద్యమం చేయాలని వ్యాఖ్యానించారు. మరో స్వాతంత్ర్య పోరాటం మాదిరిగా పోరాటం చేయాలన్నారు. మోదీ రిమోట్ కంట్రోల్.. ఆదానీ, అంబానీ చేతిలో ఉందన్నారు. విశాఖ ఉక్కును కాపాడుకోకపోతే.. ప్రజలు క్షమించరని తెలిపారు. కాంగ్రెస్ పెద్ద ఉద్యమం చేయాలి. లేకపోతే భవిష్యత్తు తరాలు క్షమించవని వీహెచ్ పేర్కొన్నారు.

Updated Date - 2021-03-09T20:41:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising